Begin typing your search above and press return to search.

మీ ఇంటికి కేసీఆర్ స‌డెన్‌ గా వ‌చ్చేస్తాడ‌ట‌

By:  Tupaki Desk   |   18 Feb 2017 1:07 PM GMT
మీ ఇంటికి కేసీఆర్ స‌డెన్‌ గా వ‌చ్చేస్తాడ‌ట‌
X
చిన్న‌ప్పుడు చ‌దువుకున్న‌/విన్న ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట్టం ఒక‌టి గుర్తుండే ఉంటుంది. రాజ‌రికం ఉన్న‌కాలంలో రాజులు ఎలాంటి స‌మాచారం లేకుండా అక‌స్మాత్తుగా త‌మ సామ్రాజ్యంలోని ప్రాంతాన్ని సంద‌ర్శించి స‌మ‌స్య‌లు తెలుసుకునేవారు. ఇపుడు సరిగ్గా అలాంటి విధానాన్నే తెలంగాణ సీఎం కేసీఆర్ అమ‌ల్లో పెట్టున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏప్రిల్ లేదా మే నుంచి ఆయ‌న తెలంగాణ‌లోని ప‌లు గ్రామాల్లో అక‌స్మాత్తుగా ప‌ర్య‌టించ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఈ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం ప్ర‌కారం ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఏదో ఒక గ్రామానికి వెళ‌తారు. అక్కడి స్థానికుల ఇంట్లో రాత్రి నిద్ర చేస్తారు. అనంత‌రం మ‌రుస‌టి రోజు గ్రామ‌స‌భ ఏర్పాటు చేసి స్థానికుల సాద‌క‌బాధ‌కాలను కేసీఆర్‌ వింటారు.

త‌న ఐదేళ్ల‌ ప‌రిపాల‌న‌లో మొద‌టి రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకున్న కేసీఆర్ ప్ర‌జ‌లను నేరుగా క‌లుసుకునేందుకు, వారికి చేరువ అయేందుకు ఈ ఆలోచ‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయా గ్రామస్థుల‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని ప‌రిష్కారం అయ్యేలా అక్క‌డిక‌క్క‌డే అధికారుల‌కు ఆదేశాలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ్రామాల్లోని చేతి వృత్తుల వారి జీవితాల‌ను మెరుగుప‌ర్చేందుకు ఉద్దేశించిన ప‌థ‌కాలు ఏ విధంగా అమ‌లు అవుతున్నాయో ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌ తెలుసుకుంటార‌ని స‌మాచారం. ఆయా ప‌థ‌కాల్లో లోపాలు ఏమైనా ఉంటే లేదా అధికారుల ప‌రంగా స‌హ‌కార లోపం ఎదుర‌వుతే మ‌రిన్ని మెరుగైన మార్గాల్లో వాటిని ప‌రిష్క‌రిస్తార‌ని తెలుస్తోంది. అంతేకాకుండా మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ‌, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు వంటి అంశాల అమ‌లు తీరును తెలుసుకుంటార‌ని స‌మాచారం.

ఇలా నేరుగా ప్ర‌జ‌ల‌తో అనుసంధానం కానున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల అమ‌లు తీరుతో ప్రోగ్రెస్ రిపోర్ట్ త‌యారు చేస్తార‌ని అనంత‌రం ప‌థ‌కాల్లో మార్పులు, చేర్పులతో పాటు కొత్త ప‌థ‌కాలు రూపొందించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/