Begin typing your search above and press return to search.
కేసీఆర్ కోసం ఈ కొత్త నిర్ణయం
By: Tupaki Desk | 26 Sep 2015 7:59 AM GMTవాస్తు అంటే విపరీతమైన అభిమానం చూపే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అనుగుణంగా ఆ రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ కోసం కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణం కానుంది.ఈ మేరకు పరిపాలన అనుమతులు పూర్తయ్యాయి. బేగంపేటలో ప్రస్తుతమున్న క్యాంపు కార్యాలయానికి వాస్తు లోపాలు, దోషముందని సీఎం కేసీఆర్ కు వాస్తు నిపుణులు సూచించారు. దీంతో వాస్తు ప్రకారం కొత్తగా క్యాంపు కార్యాలయం నిర్మించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించగా...వారు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించారు.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ నివాసముంటున్న క్యాంపు కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ స్థలంలో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణం కానుంది. కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన అధికారిక నివాసాన్ని బేగంపేటకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికారులు వాస్తుకు అనుగుణంగా మార్పులు కూడా చేశారు. అనంతరం అక్కడికి ముఖ్యమంత్రి షిఫ్ట్ అయ్యారు. అయితే క్యాంపు ఆఫీసు అచ్చిరావడం లేదని ఆయన భావించారు. దీంతో పలువురు వాస్తు నిపుణులు మరోసారి క్వార్టర్ ను పరిశీలించారు. ఇంకా కొన్ని వాస్తు దోషాలున్నాయని తెలిపారు. వాస్తు సరిదిద్దడంలో భాగంగా క్యాంపు కార్యాలయానికి వెనుక భాగాన ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ లోని స్విమ్మింగ్ పూల్ ను పూడ్చివేశారు. క్యాంపు కార్యాలయంలోని ముందు భాగాన్ని కూడా ఉపయోగించడం లేదు. అంతేకాకుండా సందర్శకుల లాంజ్ ను సైతం వినియోగించడం లేదు. అయినా.. వాస్తు ప్రకారం మరిన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వాస్తు పండితులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు. దీంతో వాస్తు ప్రకారం పూర్తి స్థాయిలో మార్పులు, చేర్పులు చేయించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు వాస్తు ప్రకారంగా క్యాంపు కార్యాలయాన్ని మార్చేందుకు వీలుగా పక్కనే ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ ను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఇందులో భాగంగా ఇటీవలే ఈ క్వార్టర్స్ కూల్చి వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అంతే కాకుండా క్వార్టర్ల కూల్చివేత కోసం రూ. 63 లక్షలను కూడా మంజూరు చేసింది.మూడు నెలల్లో ఈ కూల్చివేత ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించింది.ఇదిలా ఉండగా కొత్త క్యాంపు కార్యాలయం హైటెక్ హంగులను అద్దుకోనుంది. ఇక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడంతో పాటు, అధికారులతో సమావేశాలు, సందర్శకులను కలుసుకునేందుకు వీలుగా నిర్మాణం కాబోతుంది. అధికారుల నివాస సముదాయం కూల్చివేయడంతో మరో 3 ఎకరాల స్థలం అందుబాటులోకి రానుంది. దీంతో అన్ని రకాల హంగులతో క్యాంపు కార్యాలయం రూపుదిద్దుకో బోతుంది. అదేవిధంగా సీఎం కేసీఆర్ రక్షణకు సంబంధించి అన్ని చర్యలను తీసుకుంటున్నారు.