Begin typing your search above and press return to search.

శకునాలు బాగోటం లేదు.. యాగం ఏదైనా చేసేయటం బెటర్ కేసీఆర్

By:  Tupaki Desk   |   12 July 2020 4:00 AM GMT
శకునాలు బాగోటం లేదు.. యాగం ఏదైనా చేసేయటం బెటర్ కేసీఆర్
X
తెలంగాణలోనే కాదు.. తాను ఏ ఇష్యూను టేకప్ చేస్తే.. తాను తప్పించి మరెవరూ హైలెట్ కాని టాలెంట్ సీఎం కేసీఆర్ సొంతం. ఎవరెంత గింజుకున్నా.. మరెంత కిందామీదా పడినా తన మీద అధిక్యత ప్రదర్శించే అవకాశం అస్సులు ఇవ్వని గులాబీ బాస్ టైం ఈ మధ్యన సరిగా లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. గడిచిన ఆరేళ్లలో ఎప్పుడూ లేని సిత్రమైన పరిస్ధితుల్ని కేసీఆర్ ఎదుర్కొంటున్నారన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే చోటు చేసుకున్ పరిణామాలు ఇలాంటి వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎపిసోడ్ లోనూ కేసీఆర్ ఎంట్రీ ఇచ్చినప్పడు ఆయనొకొచ్చిన మైలేజీ అంతాఇంతా కాదు. కరోనా ఎపిసోడ్ లో ఎవరికైనా ఎదురుదెబ్బలే కానీ.. అందకు భిన్నమైన ఇమేజ్ ఎవరికైనా వచ్చిందంటే కేసీఆర్ కు మాత్రమేనని చెప్పాలి. దేశంలో లాక్ డౌన్ కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చి.. కేంద్రం కంటే ముందే అమలు చేయటమే కాదు.. తెలంగాణలో అమలవుతున్న లాక్ డౌన్.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ తో పాటు..తమిళనాడు.. కర్ణాటక.. మహారాష్ట్రల్లోనూ చర్చ జరిగిన పరిస్థితి.

అలాంటి ఆయన.. ఎందుకో తెలీదు కానీ కరోనాపై యుద్ధం చేసే విషయంలో అస్త్రసన్యాసం చేసినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఆరోపణలు మొదలైన నాటి నుంచి ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఎదురుదెబ్బలు తగులుతుండటం గమనార్హం. పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడటమే కాదు.. ఏకంగా కేసీఆర్ కు సైతం పాజిటివ్ వచ్చినట్లుగా సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా ప్రచారం సాగింది. ఆయన అధికారిక నివాసమైన ప్రగతిభవన్ లో ముప్ఫై మంది పాజిటివ్ బారిన పడినట్లుగా వార్తలు వచ్చాయి.అయితే.. ఈ రెండింటి విషయంలోనూ ఎలాంటి ఖండనలు సీఎంవో నుంచి వెలువడలేదు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులతో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తిందన్న విమర్శలు విపక్షాలు మరింత పెంచుతున్నాయి. ఇది సరిపోదన్నట్లు సచివాలయం కూల్చివేత సందర్భంగా గుడి.. మసీదు విషయంలో చోటుచేసుకున్న పరిణామాలతో తీవ్రమైన ఆవేదనతో.. బాధతో ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి రావటాన్ని ఊహించలేం. తానేదైనా పని అనుకున్నప్పుడు పక్కాగా ప్లాన్ చేయటంలో ఆయనకు ఆయనే సాటి అన్న ఇమేజ్ కు భిన్నంగా తాజా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ వాహన కాన్వాయ్ లోని వాహనం ఒకటి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న ఎస్ఐ ఎడుమ చేయి బొటనవేలు తెగింది. ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంతో కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న మంత్రులు నిరంజన్ రెడ్డి.. గంగుల కమలాకర్ షాక్ కు గరయ్యారు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే.. ‘‘అందరి మంచి’’ కోసం ఏదైనా యాగాన్ని అర్జెంట్ గా చేయిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం మీద కాస్త సీరియస్ గా ఆలోచించకూడదు కేసీఆర్?
Tags: