Begin typing your search above and press return to search.
కేసీఆర్ మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే..
By: Tupaki Desk | 4 Dec 2015 7:55 AM GMTకొన్నింటికి కొన్ని సీజన్లు నడుస్తుంటాయి. ఇక.. రాజకీయాల్లో వచ్చేసరికి సీజన్.. అన్ సీజన్ లాంటివి ఉంటాయి. కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వతీరు చూస్తే.. అన్ సీజన్ అన్న మాటే కనిపించదు. ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీలో నేతలు కిక్కిరిసిపోతున్నా.. కేసీఆర్ మాత్రం విపక్షం అన్నది లేకుండా చేసేలా ముందుకెళుతున్నట్లుగా కనిపిస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బొటాబొటి మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు చూస్తే విస్మయం కలగక మానదు.
తమకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్.. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల్ని ఇబ్బడి ముబ్బడిగా చేర్చుకుంటున్న ఆయన పార్టీల ఉనికి అన్నది కనిపించకుండా ఉండేలా జాయినింగ్స్ చేసుకుంటున్నారా? అనిపించేలా ఉంది. గత కొద్దికాలంగా కామ్ గా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు మళ్లీ చెలరేగిపోతోంది. కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నేతల్ని పార్టీలోకి తీసుకునేలా ముందుకెళుతోంది.
కొద్దికాలంగా కామ్ గా ఉన్న టీఆర్ఎస్.. ఇప్పుడే మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ ను ఎందుకు ప్రయోగిస్తున్నట్లు? అని ప్రశ్నించుకుంటే ఆసక్తికరమైన సమాధానమే లభిస్తుంది. కేసీఆర్ వ్యూహరచనకు ముచ్చట పడిపోయేలా చేస్తుంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ తీవ్ర ఒత్తిడిలో ఉంటాయి. తాము విజయం సాధిస్తామా? లేమా? అన్న సందేహం ఉన్న సమయంలోనూ.. తమ ప్రత్యర్థికి తీవ్రస్థాయిలో పోటీ ఇచ్చేలా ప్లాన్ చేస్తుంటాయి. ఇలాంటి సమయం చూసుకొని మరీ దెబ్బ కొట్టి.. వాటి ఆత్మస్తైర్యాన్ని.. పోరాట పటిమను తీవ్రంగా దెబ్బ తీయటమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యూహంగా కనిపిస్తుంది.
తమ వెంటే ఉండే నేతలు ఉన్నట్లుండి వీడిపోయేలా చేసి షాక్ ఇచ్చేలా చేస్తారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే.. మరి కొంతమంది జంపింగ్స్ పాల్పడటం లాంటివి చోటు చేసుకోవటంతో అసలేం జరుగుతుందో అర్తం కాకపోవటమే కాదు.. అసలు ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదన్న సందేహం కలిగేలా చేస్తారు? ఏ సమయంలో అయితే తమ మీద పైచేయి సాధించటానికి వ్యూహాలు రచిస్తుంటారో.. అదే సమయంలో రివర్స్ గేర్ లో వ్యూహాత్మక దాడికి పాల్పడటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యం.
సాధారణంగా అధినేతలు ఎవరైనా సరే సంతృప్తి స్థాయి ఉంటుంది. కానీ.. దివంగత వైఎస్ కు.. కేసీఆర్ కు మధ్య ఒక దగ్గర పోలిక ఉంది. ప్రత్యర్థి పట్ల కఠినంగా ఉండటం.. దయా.. దాక్షిణ్యాలన్నవి ప్రదర్శించకుండా ఉంటూ.. వాటి అంతు చూసే వరకూ నిద్రపోని తత్వం కనిపిస్తుంది.2009 ఎన్నికల తర్వాత వైఎస్ తీరు చూస్తే.. ఇప్పుడు అండ పిండ బ్రహ్మాండంగా కనిపిస్తూ.. కాంగ్రెస్.. తెలుగుదేశం లాంటి పార్టీలకు ముచ్చమటలు పోయిస్తున్న టీఆర్ఎస్.. ఉనికి కోసం విపరీతంగా కొట్టుమిట్టాడేది.
ఇప్పుడు కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీల్లో ఎలాంటి పరిస్థితి ఉందో.. అప్పట్లో టీఆర్ఎస్ లో అలాంటి పరిస్థితే ఉండేది. ఎప్పుడు ఏ నేత తమతో ఉంటారో.. ఎప్పుడు ఎలాంటి షాక్ తగులుతుందో అర్థం కాక కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. ఓడలు బండ్లు కావటం.. బండ్లు ఓడలు కావటం రాజకీయాల్లో మామూలేనని కేసీఆర్ ను చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు తన ఉనికి అన్నది లేకుండా ఊపిరి తీసేసే ప్రయత్నం చేసిన వైఎస్ ప్లాన్ ను ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత అమలు చేస్తున్నారని చెప్పాలి.
ఒకవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. అది పూర్తి అయిన వెంటనే.. గ్రేటర్ ఎన్నికలతో పాటు.. వివిధ జిల్లాల్లో కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ ఆకర్ష్ ఆస్త్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి బయటకు తీశారు. ప్రత్యర్థికి షాకులు ఇవ్వటంతో పాటు.. తుత్తనీయుల్ని చేసేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు.
ప్రత్యర్థిపై మైండ్ గేమ్ ఆడటంలో మొనగాడైన కేసీఆర్.. ఇప్పడదే ఆటను ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల మీద దృష్టి పెట్టాల్సిన సమయంలో.. పార్టీల్లోనేతల్ని కాపాడుకునే విషయంపై ఫోకస్ చేసే పరిస్థితిని ఆయన సృష్టించారు. తలపండిన రాజకీయ పార్టీలకు ఇంతకు మించిన దయనీయ పరిస్థితి ఇంకేం ఉంటుంది చెప్పండి. రానున్న వారం.. రెండు వారాల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే.. పలువురునేతలు కారు ఎక్కేస్తున్నారో.. ఈ జోరు కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలకు ముందే.. ప్రత్యర్థి మీద తిరుగులేని అధిక్యం సాధించటానికి మించిన కిక్కు మరింకేమి ఉంటుంది చెప్పండి.