Begin typing your search above and press return to search.
మహరాష్ట్రలో కేసీఆర్ మీడియా స్ట్రాటజీ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
By: Tupaki Desk | 26 April 2023 10:00 AM GMTచేతిలో డబ్బులు ఉండగానే సరిపోదు.. వాటిని ఎఫెక్టివ్ గా ఎలా ఖర్చు చేయాలన్నది చాలామందికి చేతకాదు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. మాటలతో సెంటిమెంట్ ను రాజేయటం.. భావోద్వేగాలకు రాజకీయ ప్రయోజనాల్ని పొందే విషయంలో ఆయనకు సాటి మరెవరూ రారనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమ వేళలో.. జర్నలిస్టుల్ని ముడి దినుసులుగా వాడి.. తెలంగాణ ఉద్యమాన్ని రాజేసిన ఆయన.. రాష్ట్ర సాధన తర్వాత.. తమకు సన్నిహితంగా ఉండే గుప్పెడు మంది మీడియా ప్రముఖులకు పదవులు కట్టబెట్టేసి.. నోళ్లు మూసేశారన్నమాట పెద్ద ఎత్తున వినిపించటం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన ఆరోగ్య బీమా స్కీంను తీసి అవతల పడేయటమే కాదు.. జర్నలిస్టులకు ఆరోగ్య ధీమా లేకుండా చేసింది కేసీఆర్ సర్కారు. గతంలో జర్నలిస్టులకు వెయ్యి రూపాయిల మొత్తాన్ని చెల్లిస్తే.. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేవారు. జర్నలిస్టులను అసరా చేసుకొని పైకి వచ్చిన కేసీఆర్ సర్కారు.. వారిని పూర్తిగా వదిలేసింది.
అంతేనా.. గూడు లేని పేదలకు డబుల్ బెడ్రూం అని చెప్పిన కేసీఆర్.. జర్నలిస్టులకు ట్రిపుల్ బెడ్రూంలు ఏర్పాటు చేస్తామని చెప్పటమే కాదు..వాటిని ఎప్పటికి తయారు చేసేదీ చెప్పేశారు. కానీ.. అవేమీ ఇప్పటివరకు మొదలు కూడా కాకపోవటం గమనార్హం.
ఇదంతా ఎందుకంటే.. అవసరం ఉన్నప్పుడు ఒకలా.. అవసరం తీరిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారన్న దానికి నిదర్శనంగా కేసీఆర్ సర్కారు నిలుస్తుంది. నిన్నటి ప్రాంతీయ పార్టీ నేడు జాతీయ పార్టీగా మారి.. మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టిన గులాబీ బాస్.. అక్కడ వరుస సభల్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యవహరిస్తున్న మీడియా మేనేజ్ మెంట్ చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు.
మహారాష్ట్రలో తమకు.. తమ పార్టీకి ఎలాంటి పట్టు లేని నేపథ్యంలో..అక్కడి మీడియాను ఉపకరణంలా వాడేస్తూ.. ప్రజల్లోకి వెళ్లేందుకు షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. మీడియాను ఎలా తమ దారికి తెచ్చుకోవాలి? ప్రధాన మీడియా సంస్థలతో సంప్రదింపులకు ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలన్న దానికి సంబంధించిన నిజామాబాద్ కు చెందిన ఒక గులాబీ నేతకు ప్రత్యేకంగా బాధ్యతను అప్పగించినట్లుగా సమాచారం.
తాజాగా నిర్వహించిన బహిరంగ సభలకు మీడియా ప్రచారం కోసమే బీఆర్ఎస్ పార్టీ సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. వాటిల్లో ప్రధాన పత్రికలకు రూ.5 కోట్ల వరకు యాడ్స్ రూపంలోనూ.. ఇతర రూపాల్లో చెల్లించినట్లుగా చెబుతున్నారు. ప్రధాన పత్రికల్లో భారీ ఎత్తున యాడ్స్ ఇవ్వటంతో.. బీఆర్ఎస్ బహిరంగ సభల వార్తలు బ్యానర్ రూపంలో వస్తున్నాయి. యాడ్స్ దెబ్బకు బీఆర్ఎస్ నిర్వహించే ప్రెస్ మీట్లను సైతం మొదటి పేజీలోకి తీసుకొచ్చేలా చేస్తుండటం గమనార్హం.
మహారాష్ట్రంలో భారీ సర్క్యులేషన్ ఉన్న ప్రముఖ.. మధ్యస్థ.. చిన్నపత్రికలకు వాటి స్థాయి ఆధారంగా యాడ్స్ రూపంలో చెల్లిస్తున్నారు. అంతేకాదు.. ప్రెస్ మీట్లకు.. తమ సభల కవరేజ్ లకు హాజరయ్యే విలేకరులకు రాచ మర్యాదలు చేయటమే కాదు.. భారీ నజరానాలు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు బీఆర్ఎస్ మూడు ప్రాంతాల్లో బహిరంగ సభల్ని నిర్వహించింది. నాందేడ్.. లోహాకంధార్.. ఔరంగాబాద్ లలో నిర్వహించిన బహిరంగ సభలకు భారీగా జనాన్ని తరలించేందుకు వీలుగా మండలాల వారీగా డబ్బు ముట్ట జెప్పటంతో పాటు.. బహిరంగ సభల కవరేజ్ కు వచ్చే విలేకరులకు భారీ నజరానాలు ఇచ్చారని చెబుతున్నారు.
ఇందులో భాగంగా ప్రధాన మీడియా సంస్థ నుంచి హాజరయ్యే విలేకరికి రూ.25వేలు.. చిన్న స్థాయి పత్రికల జర్నలిస్టులకు రూ.10 వేలు చొప్పున ఆఫర్ చేశారన్నది సమాచారం. మండల స్థాయి జర్నలిస్టులకు రాచమర్యాదలు (ఇప్పటివరకు అక్కడి రాజకీయ పార్టీలు ఇలాంటివేమీ చేయలేదంటున్నారు) చేయటంతో వారంతా బీఆర్ఎస్ మీద ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ.. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లోనూ మొదటి పేజీల్లో భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వటం ద్వారా.. బీఆర్ఎస్ ను.. గులాబీ బాస్ ఇమేజ్ ను అంతకంతకూ పెంచేలా చేస్తున్నారు. దీని కోసం లక్షలాది రూపాయిల్ని ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.