Begin typing your search above and press return to search.
ఒక్కమాటనే 9రోజులుగా చెబుతున్న కేసీఆర్
By: Tupaki Desk | 16 Sep 2015 4:41 AM GMTచెప్పిన మాటనే మళ్లీ చెప్పటం పెద్ద తప్పేం కాదు. కానీ.. బోర్ కొట్టించకుండా చెప్పటంలోనే తెలివి దాగి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కష్టసాధ్యమైన ఫీట్ ను అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులుగా చైనాలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం హాంకాంగ్ కు చేరుకున్నారు. గత తొమ్మిది రోజులుగా తన పర్యటనలో కేసీఆర్ చేస్తున్న ప్రసంగం.. చెబుతున్న మాటల్ని చూస్తే.. ఒక్క అంశం చుట్టూనే తిరుగుతుందన్న విషయం అర్థమవుతుంది.
తొలి రెండు రోజుల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గురించి.. ఉమ్మడి రాష్ట్ర ప్రయోగం విఫలమైందని.. మోడీ పాలన అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించిన కేసీఆర్.. తర్వాత నుంచి ఒకే మాటను పదే పదే చెప్పుకొస్తున్నారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని.. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని ఎర్ర తివాచీతో స్వాగతిస్తామని.. పెట్టుబడిదారుల విషయంలో తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్న విషయాల్ని ఆయన పదే పదే చెప్పుకొస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక పాలసీగా అభివర్ణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిందిగా కోరటం కనిపిస్తుంది. నిజానికి చైనా పర్యటన మొత్తం పెట్టుబడుల్ని ఆకర్షించేందుకే కావటం.. ఇంతకు మించి చెప్పుకోవటానికి ఏమీ లేకపోవటంతో చెప్పిన మాటల్నే చెప్పాల్సి వస్తుందన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి తొమ్మిది రోజులుగా ఒకే విషయాన్ని మార్చి.. మార్చి చెప్పటంతో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. తన విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రికి హైదరాబాద్ కు కేసీఆర్ బృందం చేరుకోనున్నారు.