Begin typing your search above and press return to search.

ప్రారంభోత్స‌వ క‌త్తెర ఏదివ‌యా..? రిబ్బన్ గుంజిపారేసిన కేసీఆర్!

By:  Tupaki Desk   |   4 July 2021 3:30 PM GMT
ప్రారంభోత్స‌వ క‌త్తెర ఏదివ‌యా..? రిబ్బన్ గుంజిపారేసిన కేసీఆర్!
X
పెళ్లికి అంతా సిద్ధం చేసి.. మంగ‌ళసూత్రం మ‌రిచిపోయిన‌ట్టుగా ఉంది ఇక్క‌డి వ్య‌వ‌హారం. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదివారం రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టించారు. పలు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. మండేప‌ల్లి డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను ప్రారంభించారు. ఇందులో ఒక ఇంటిని ముఖ్య‌మంత్రి అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇంటి ద‌ర్వాజ‌కు రిబ్బ‌న్ క‌ట్టారు. మంత్రాలు చ‌ద‌వ‌డానికి పంతులు కూడా సిద్ధంగా ఉన్నారు. అధికారులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు అంద‌రూ వ‌చ్చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో స‌హా.. అంద‌రూ ప్రారంభించాల్సిన ఆ ఇంటి వ‌ద్ద‌కు వెళ్లారు. ఫొటో గ్రాఫ‌ర్లు, వీడియో గ్రాఫ‌ర్లు త‌మ ప‌ని మొద‌లు పెట్టేశారు కూడా..

కానీ.. రిబ్బ‌న్ క‌ట్ చేయ‌డానికి అవ‌స‌రమైన క‌త్తెర క‌నిపించ‌లేదు. క‌త్తెర ఏది అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అడ‌గ్గా.. అక్క‌డ ఉన్న‌వారంతా ఒక‌రి ముఖం మ‌రొక‌రు చూసుకున్నారు. ఎక్క‌డ ఉంది? ఎక్క‌డి ఉంది? అంటూ.. హ‌డావిడి చేశారు. దీంతో.. కాసేపు ఎదురు చూసిన సీఎం.. ఆ త‌ర్వాత అస‌హ‌నానికి లోన‌య్యారు.

చేత్తోనే రిబ్బ‌న్ గుంజిపారేసి భ‌వ‌నాన్ని ప్రారంభించారు. రిబ్బ‌న్ తొల‌గించిన త‌ర్వాత ల‌బ్ధిదారుల‌తో క‌లిసి గృహ‌ప్ర‌వేశం చేశారు. అంతా సిద్ధం చేసి.. క‌త్తెర మిస్స‌వ‌డంతో.. అక్క‌డి అధికారులు ఒత్తిడికి గుర‌య్యారు. కానీ.. ఈ లోగానే సీఎం కేసీఆర్ చేత్తో ప్రారంభించేశారు.