Begin typing your search above and press return to search.
ఈసారి కేసీఆర్ వంతు... ఏపీతో కంపేర్ చేసుకోండి!
By: Tupaki Desk | 13 Jun 2023 9:36 AM GMTగతకొన్ని రోజులు గా తెలంగాణ అధికార పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ పై డైలాగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా హరీష్ రావు ఈ విషయంలో దూకుడు ప్రదర్శించారు. ఏపీ తో కంపేర్ చేసి చూసుకోండి.. తెలంగాణ రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో అర్ధమవుతుంది అన్నట్లుగా స్టేట్ మెంట్లు ఇచ్చారు. అయితే ఈ కామెంట్ల పై ఏపీ మంత్రులు వరుస పెట్టి హరీష్ ని వాయించి వదిలి పెట్టిన సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా కేసీఆర్ సైతం ఇదే పాట పాడారు.
తాజాగా గద్వాల జిల్లాలో జరిగిన ప్రగతి నివేదన సభ లో మైకందుకున్న కేసీఆర్... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు రూపు రేఖలు మారిపోయాయని తెలిపారు. అనంతరం... "ఇక్కడ కు ఆంధ్ర కేవలం 25కి.మీ. దూరమే ఉంది. ఇక్కడి కి ఏపీ కి ఎంత తేడా ఉందో మీరే గమనించండి" అంటూ ప్రజల కు సూచించారు. గతం లో పాలమూరు నుంచి వలస వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు తరలివస్తున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఏ సభ లో అయినా కచ్చితంగా ధరణి ప్రస్తావన తీసుకొచ్చే కేసీఆర్... గద్వాల్ సభ లో కూడా ధరణి టాపిక్ ఎత్తారు. ధరణి కారణంగానే రైతు బంధు నగదు నేరుగా మీ బ్యాంకు ఖాతా లో పడుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో అనుకోకుండా ఒక రైతు మరణిస్తే బీమా సొమ్ము రూ.5లక్షలు పది రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతా లో జమ అవుతున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 12 మండలాలు, 4 మున్సిపాలిటీలూ ఉండగా... ప్రతి గ్రామాని కి రూ.10 లక్షల గ్రాంటు, మండల కేంద్రాల కు రూ.15 లక్షలు గ్రాంటు, గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.50 కోట్ల గ్రాంటు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదే క్రమం లో ప్రతిపక్షాల మీద ఫైర్ అయిన ఆయన... ఏనాడూ ప్రజల గురించి ఆలోచించని కొందరు వ్యక్తులు ధరణిని తీసేస్తామని.. బంగాళాఖాతం లో కలిపేస్తామని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఇది ధరణి ని బంగాళాఖాతంలో వేయడమా.. లేదా ప్రజల ను బంగాళాఖాతంలో వేయడమా అనేది ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.