Begin typing your search above and press return to search.
కేసీఆర్ కంటి వెలుగు పిచ్చ ఓల్డ్ అట!
By: Tupaki Desk | 22 Aug 2018 5:29 AM GMTప్రపంచంలో ఏ మూలన ఏమున్నా ఈ రోజున తెలుసుకోవటం పెద్ద కష్టమైన పని కాదు. అలాంటి సానుకూలతను అయుధంగా మార్చుకునే వారు కొందరు ఉంటారు. అలాంటి వారి లిస్టు తయారు చేస్తే.. అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పనిసరిగా ఉంటుంది.
దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని రీతిలో కేసీఆర్ వ్యవహారశైలి ఉంటుందని చెప్పక తప్పదు. ఏ రాజకీయ నేత అయినా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీల్ని తనకున్న ఐదేళ్ల కాలంలో పూర్తి చేయక నానా ఇబ్బందులు పడిపోతుంటారు. కానీ.. కేసీఆర్ తీరు వేరు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విషయంలో మిగిలిన వారికన్నా విలక్షణంగా వ్యవహరిస్తుంటారు.
తానిచ్చిన హామీల అమలు సంగతి ఎలా ఉన్నా.. కొత్త పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చి తెగ ప్రచారం చేస్తుంటారు. తెలంగాన ఎన్నికల మేనిఫేస్టోను చూస్తే.. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య.. పేదలకు భూ పంపిణీ లాంటి కీలకమైన అంశాల్ని ఇప్పటివరకూ పూర్తి చేసింది లేదు. కానీ.. వాటికి మించిన రైతు బీమా.. కంటి వెలుగు.. రైతులకు పెట్టుబడి సాయం లాంటి కొత్త కొత్త పథకాలు తెర మీదకు రావటం కనిపిస్తుంది.
ఇచ్చిన హామీల్ని వదిలేసి.. గతంలో ప్రస్తావించని హామీల్ని అమలు చేసే విచిత్రమైన ధోరణి కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. తాజాగా హడావుడి చేస్తున్న కంటివెలుగు పథకం గుట్టు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. దేశంలో తానే తొలిసారి స్టార్ట్ చేసినట్లుగా చెప్పే ఈ పథకాన్ని అప్పుడెప్పుడో అరవై.. డెబ్బైల్లోనే కరుణ సర్కారు తమిళనాడులో అమలు చేసినట్లుగా చెబుతున్నారు.
అంతేకాదు.. పంట రుణ సాయాన్ని సైతం ఎన్టీఆర్ హయాంలో అమలు జరిగిందేనన్న మాట వినిపిస్తుంది ఇవే కాదు.. కేసీఆర్ తెర మీదకు తెచ్చే చాలా పథకాలు.. గతంలో వివిధ ప్రభుత్వాలు అమలు చేసినవే అయి ఉంటాయన్న మాటా వినిపిస్తోంది. పాత సారాను కొత్త సీసాలో పోసిన చందంగా.. అప్పుడెప్పుడో అమలు చేసిన పథకాలకు తనదైన రీతిలో ట్రీట్ మెంట్ ఇచ్చి బయటకు తెస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. పాత పథకాలకు కొత్తగా రీరిలీజ్ చేసి..ఎవరి చేతా వేలెత్తి చూపించుకోకుండా.. భారీ మైలేజ్ సొంతం చేసుకోవటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమేమో?