Begin typing your search above and press return to search.
మరోసారి భారీ యాగానికి కేసీఆర్ సిద్ధం.. ఈసారి ఎక్కడంటే?
By: Tupaki Desk | 11 Jan 2021 9:30 AM GMTదేశంలోని ముఖ్యమంత్రులకు కాస్త భిన్నంగా వ్యవహరించే వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారో చెప్పటం అంత సులువైన విషయం కాదు. దుబ్బాక ఉప ఎన్నిక ముందు వరకు తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదన్నట్లుగా ఉండే పరిస్థితి. అందుకు భిన్నంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కాస్త మారిస్తే.. ఇటీవల వెల్లడైన జీహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్ అధిక్యంపై కొత్త సందేహాలు కలిగేలా చేశాయి.
ఇంతకాలం అంతా తన కంట్రోల్ లోనే ఉందనుకున్న దానికి భిన్నంగా చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ కలత చెందుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. తన అమ్ములపొదిలో ఉన్న అధ్యాత్మిక అస్త్రాన్ని తాజాగా తీసినట్లు చెబుతున్నారు. గతంలో తన ఫాంహౌస్ లోభారీ ఎత్తున యాగాలు చేసిన సీఎం.. ఈసారి మరోసారి భారీ యాగానికి తెర తీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో తనకు తిరుగులేకుండా ఉండాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన యాదాద్రిలో ఈ యాగాన్ని నిర్వహిస్తారంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఫిబ్రవరిలో సుదర్శన యాగం.. చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేసే వీలుందంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే యాదాద్రిపనుల్ని ఈ నెలఖరు నాటికి పూర్తి చేయాలన్న ఆదేశాల్ని అధికారులకు జారీ చేశారు.
సీఎం హోదాలో యాదాద్రి ఆలయాన్ని ప్రారంభిస్తారని.. అనంతరం తన కుమారుడుకేటీఆర్ కు సీఎం బాధ్యతల్ని అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తంగా రెండు నెలల్లో ఈ మార్పులన్ని చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. తొలుత యాగాలు.. అనంతరం యాదాద్రి ప్రారంభం.. ఆ వెంటనే కేసీఆర్ కు పట్టాభిషేకం జరుగుతాయని చెబుతున్నారు. రానున్న మూడు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఉంటాయంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.