Begin typing your search above and press return to search.

యాక్షన్ మోడ్ లోకి కేసీఆర్.. వరుస భేటిలు.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   9 March 2023 11:31 AM GMT
యాక్షన్ మోడ్ లోకి కేసీఆర్.. వరుస భేటిలు.. ఏం జరుగుతోంది?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ యాక్షన్ మోడ్ లోకి వచ్చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండడం.. కూతురు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం వెంటాడుతుండడంతో కేసీఆర్ వరుస భేటిలతో కాకరేపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో కేసీఆర్ తాజాగా అలెర్ట్ అయినట్టుగా పరిణామాలను బట్టి విశ్లేషఖులు అంచనా వేస్తున్నారు.

తాజాగా కేసీఆర్ ఈరోజు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక శుక్రవారం రేపు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. గతంలో కేబినెట్ భేటి, విస్తృతస్థాయి సమావేశం తర్వాత కేసీఆర్ ముందస్తుకు వెళ్లి గెలిచారు. ఈసారి కవిత అరెస్ట్ నేపథ్యంలో కేసీఆర్ ఏ కీలక నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.

కేబినెట్ భేటిలో పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమలు చేయలేకపోయారు. ఇవి ఎన్నికల్లో హైలెట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ పథకాలను ఎలాగైనా సరే ప్రారంభించాలని అనుకుంటున్నారు.

ఇక వచ్చే ఎన్నికల కోసం దాచేసిన ఓ సంచలనాత్మక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు. అది రైతు పించన్ అని ప్రచారం సాగుతోంది.

కార్యవర్గ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి కవిత అరెస్ట్ పై ఎలా ముందుకెళ్లాలన్న దానిపైనే కేసీఆర్ ఓ నిర్ణయానికి రాబోతున్నట్టు సమాచారం. తెలంగాణ హోరెత్తేలా కేసీఆర్ కార్యాచరణ ఉండబోతోందని అంటున్నారు. మరి కేసీఆర్ తీసుకునే ఆ కీలక నిర్ణయాలు ఏంటి? ఎలా ఉండబోతున్నాయన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.