Begin typing your search above and press return to search.

బీ అలర్ట్‌: కేసీఆర్‌ తన వాళ్లకు ప్రత్యేక ఆదేశాలిచ్చాడు!

By:  Tupaki Desk   |   12 Jun 2015 5:09 AM GMT
బీ అలర్ట్‌: కేసీఆర్‌ తన వాళ్లకు ప్రత్యేక ఆదేశాలిచ్చాడు!
X
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం దెబ్బతిన్న స్థితిలో ఉంది. అది ఎలాంటి ప్రతీకర చర్యలకు అయినా దిగవచ్చు. సో మీరు చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎలాంటి పథకాన్ని వేసి అయినా.. మనల్ని బద్నాం చేయడానికి తెలుగుదేశం వాళ్లు ప్రయత్నిస్తారు...' అంటూ తన పార్టీ నేతలందరికీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

ఓటుకు నోటు వ్యవహారంలో దూకుడుగా ముందుకు వెళుతున్న తెరాస అధినేత తెలుగుదేశం నుంచి ప్రతీకార చర్యలు ఉంటాయని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాడు. స్వయంగా తెలుగుదేశం అధినేతనే తాము ఇబ్బంది పెడుతున్నామన్న అవగాహన ఉన్న కేసీఆర్‌ తెలుగుదేశం నుంచి కూడా ఏదో విధంగా టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉందన్న అభిప్రాయంతో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తనకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొనీ తెరాసపై ఏదో విధమైన దాడికి పూనుకోవచ్చనేది కేసీఆర్‌ అంచనా.

అందుకే ప్రతి గులాబీ చొక్కా జాగ్రత్తగా ఉండాలని.. తెలుగుదేశం ట్రాప్‌లోకి పడకూడదని. ఇప్పుడే మనం స్ట్రాంగ్‌గా ఉండాలని కేసీఆర్‌ తన పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్నాడు.

కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి వారినే కాదు.. తెలంగాణ ప్రభుత్వ అధికారులను కూడా తెలుగుదేశం లక్ష్యంగా చేసుకోవచ్చు.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కూడా టార్గెట్‌ చేసుకోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.

తెలుగుదేశం ఏదో విధంగా బురద చల్లేందుకు ప్రయత్నిస్తుంది జాగ్రత్తగా ఉండండి..అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. మరి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, ప్రభుత్వ అధికారులు ఏ మేరకు అలర్ట్‌గా ఉంటారో!