Begin typing your search above and press return to search.

కేసీఆర్‌.. వారికిప్పుడు దేవుడు!

By:  Tupaki Desk   |   19 Jun 2017 5:41 AM GMT
కేసీఆర్‌.. వారికిప్పుడు దేవుడు!
X
ఎన్నిక‌ల ఏడాదిలో ఎంతోకొంత చేయ‌టం.. హ‌డావుడి నిర్ణ‌యాలు తీసుకోవ‌టం.. ఓటు బ్యాంకును మ‌రింత పెంచుకునేందుకు నిర్ణ‌యాలు తీసుకోవ‌టం.. ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని అలెర్ట్‌గా ఉంచ‌టం లాంటివి తెలిసిన రాజ‌కీయాలే. కానీ.. కోరిన వారికి.. కోర‌ని వారికి వ‌రాల మీద వ‌రాలు ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యాలు తీసుకోవ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మాత్ర‌మే చెల్లుతుంది.

వివిధ వ‌ర్గాల‌కు క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో వ‌రాల్ని ప్ర‌క‌టిస్తున్న కేసీఆర్‌.. తాజాగా మ‌రో దీర్ఘ‌కాలిక డిమాండ్‌ ను నెర‌వేరుస్తూ.. ఫుల్ హ్యాపీగా ఫీల‌య్యేలా నిర్ణ‌యం తీసుకున్నారు. కాంట్రాక్టు జూనియ‌ర్ లెక్చర‌ర్ల‌కు భారీగా జీతాన్ని పెంచేస్తూ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. కాంట్రాక్టు జూనియ‌ర్ లెక్చ‌ర్ల జీతాల్ని తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఆ మ‌ధ్య‌న పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. మ‌ళ్లీ మ‌రోసారి జీతాల పెంపు నిర్ణ‌యాన్ని తాజాగా తీసుకోవ‌టం విశేషంగా చెప్పాలి.

17 ఏళ్లుగా చాలామంది కాంట్రాక్టు జూనియ‌ర్ లెక్చ‌రర్లుగా ప‌ని చేస్తున్నారు. వీరికిచ్చే వేత‌నం కేవ‌లం రూ.18 వేలు మాత్ర‌మే. దీంతో.. వీరి జీతాన్ని మ‌రింత పెంచాల‌న్న డిమాండ్ పెద్ద ఎత్తున రావ‌టం.. దీనికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు రూ.18 వేల నుంచి రూ.27వేలుగా చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

తాజాగా మ‌రోసారి వారి వేత‌నాల్ని భారీగా పెంచుతూ తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోవ‌ట‌మే కాదు.. జీవోను జారీ చేసేశారు. తాజా నిర్ణ‌యం ప్ర‌కారం ఇప్పుడున్న రూ.27వేలుకు మ‌రో ప‌దివేల రూపాయిల్ని పెంచుతూ నిర్ణ‌యం తీసుకోవ‌టంపై కాంట్రాక్ట్ జూనియ‌ర్ లెక్చ‌రర్ల ఆనందం అంతా ఇంతా కాదు. స్వ‌ల్ప‌వ్య‌వ‌ధిలో ప‌ది వేల రూపాయిల జీతం పెంచ‌టం అంటే ఎవ‌రు మాత్రం సంతోషంగా ఉండ‌రు? మ‌రింత భారీగా జీతాలు పెంచిన‌ప్పుడు.. కాంట్రాక్టు జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల‌ దృష్టిలో సీఎం కేసీఆర్ దేవుడు కావ‌టంలో కొత్తేముంది?

కొస‌మెరుపు ఏంటంటే... ఈ కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్లు ఒక్కొక్క‌రు కొత్త ఓట‌ర్ల‌ను వంద మందికి కేసీఆర్ గురించి ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన పోస్టుల్లో ఉన్నోళ్ల‌న్న విష‌యం గ‌మ‌నించాలి. యావ‌రేజ్‌ను ఒక్కో లెక్చ‌ర‌ర్ 18-22 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న ఓట‌ర్ల‌కు పాఠాలు చెప్పే వారే. మ‌రి ఇంత జీతం పెంచాక కేసీఆర్ గురించి అడ‌క్క‌పోయినా వారు మంచే చెబుతారుగా పిల్ల‌ల‌కు. !

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/