Begin typing your search above and press return to search.

మాట నిల‌బెట్టుకున్న కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   25 Jun 2017 9:25 AM GMT
మాట నిల‌బెట్టుకున్న కేసీఆర్‌!
X
ముఖ్య‌మంత్రుల‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌త్యేకం. సంద‌ర్భానికి త‌గ్గ‌ట్లుగా చ‌మ‌త్క‌రించ‌డం - జ‌నాక‌ర్ష‌క‌ ప్ర‌సంగాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఆయ‌న దిట్ట‌. సాయం కోసం వ‌చ్చిన వారికి ఆప‌న్న హ‌స్తం అందించ‌డం - సీనియ‌ర్ల‌ను గౌర‌వించ‌డం వంటి విష‌యాల్లో కేసీఆర్ ముందుంటారు. ఇచ్చిన మాట ప్ర‌కారం కొండ‌పాక మాజీ ఎమ్మ‌ల్యే దొమ్మాట రామచంద్రారెడ్డికి కేసీఆర్‌ ఆర్థిక సాయం అందించి త‌న‌ రూటే సెప‌రేట‌ని మ‌రోసారి చాటుకున్నారు.

సీఎం కేసీఆర్‌ను కొండపాక మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డి నాలుగు రోజుల క్రితం కొండపాకలో గొర్రెల పంపిణీ కార్యక్రమం సంద‌ర్భంగా క‌లిశారు. అనారోగ్యం - ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాన‌ని - సాయం చేయాల‌ని కోరారు. ఆయన దీనస్థితిని చూసి చలించిపోయిన కేసీఆర్ సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆయ‌న‌ను అన్నా అని సంబోధించి రామ చంద్రారెడ్డిపై గౌర‌వాన్ని చాటుకున్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆప్యాయంగా ప‌ల‌క‌రించి త‌న ఔదార్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయనకు ఇంటి స్థలం కూడా లేకపోవడంతో వెంటనే ఇంటి స్థలం కేటాయించాలని కలెక్టర్‌ ను ఆదేశించారు. సాయం చేస్తానన్న మాట ప్రకారం రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని - డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు మంజూరు చేశారు. రామచంద్రారెడ్డికి రూ.25 లక్షల చెక్కును మంత్రి హరీష్‌ రావు కొండపాకలో అందజేశారు. కాగా, కేసీఆర్‌ సాయానికి ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/