Begin typing your search above and press return to search.

కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ భేటి కథేంటి?

By:  Tupaki Desk   |   23 Feb 2023 5:00 PM GMT
కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ భేటి కథేంటి?
X
బీఆర్ఎస్ విస్తరణ, రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో 4 గంటలపాటు ప్రగతిభవన్ లో భేటి అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం అత్యవసర సమావేశంలో పార్టీలోని ముఖ్యమైన నాయకులను పిలిపించుకున్నారు. ఆయన పిలుపు మేరకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు తమ పనులను క్యాన్సిల్ చేసుకొని కేసీఆర్ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు మరికొందరు ముఖ్యనేతలు ఉన్నారు. కేసీఆర్ ఇంత హడావుడిగా మీటింగ్ పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ సమావేశం వివరాలు బయటకు పొక్కనీయలేదు. గురువారం మరోసారి వీరు కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేని కోసం ఈ సమావేశం అన్నది ఉత్కంఠగా మారుతోంది. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పథకాలు ఎలా అమలు చేయాలన్నదానిపై చర్చ సాగిందని అనుకుంటున్నారు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా? అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి? ఎలాంటి పథకాలు ప్రశేవపెట్టాలి? అనే దానిపై కూడా చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛనల్ లాంటి పథకాలపై మార్పులు చేయాలా? లేక వీటి స్థానంలో కొత్తవి తీసుకురావాలా? అనేదానిపై చర్చిస్తారని అంటున్నారు. ఇటీవల రైతు బంధు పథకాన్ని తీసేసి దాని స్థానంలో రైతులు సంతృప్తి పడేలా కొత్త పథకం తీసుకొస్తారని అంటున్నారు. ఈ విషయం కూడా మీటింగ్ లో ప్రస్తావన ఉంటుందని అంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం గడువు జనవరి 2024 వరకు ఉంది. అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. కానీ అంతకంటే ముందుగానే ముందస్తు ఎన్నికల్లోకి వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నారని అనుకుంటున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం రద్దు చేయడం ద్వారా రెండు రాష్ట్రాల్లో ప్రచారం చేసుకునే వీలుంటుందని అంటున్నారు. ప్రభుత్వ రద్దుపై ముఖ్యమైన నాయకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయం తీసుకున్నాక కేసీఆర్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

రాష్ట్ర జాతీయ స్థాయి రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా దిశానిర్ధేశం చేయాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం. కేసీఆర్ అర్జంట్ మీటింగ్స్ పెట్టడం వెనుక ఏజెండా ఇదేనని అంటున్నారు.. అయితే గురువారం మరోసారి సమావేశం కానున్నారు.

ఈ సమావేశం తరువాత కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ రద్దుపైనే సమావేశం నిర్వహిస్తే పరోక్షంగానైనా సంకేతాలు ఇస్తారని అంటున్నారు. అదీగాక ప్రభుత్వ పథకాల విషయంలో మాట్లాడితే వాటిలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఏదీఏమైనా కేసీఆర్ గురువారం జరిగే సమావేశం తరువాత కేసీఆర్ ఏం చెబుతారో చూడాలి.

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారానే అధిక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం తాము ముందస్తుకు రెడీ అని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దీంతో తాము ఏమాత్రం తీసిపోమని చెప్పడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లి ఆ తరువాత ఎన్నికల్లోకి వెళ్తారని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం బీఆర్ఎస్ హవా ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఎలక్షన్ మూడ్ లోకి వెళ్తే మరోసారి అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, కాంగ్రెస్ 'హాథ్ సే హాథ్ జోడో' లాంటి యాత్రలతో ప్రజలకు చేరువవుతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే మరింత ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే దీనిపై సమాలోచనలు చేసినట్టు సమాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.