Begin typing your search above and press return to search.

జలజగడం : సుప్రీం కోర్టుకు కేసీఆర్‌ ప్రభుత్వం !

By:  Tupaki Desk   |   8 July 2021 12:30 PM GMT
జలజగడం : సుప్రీం కోర్టుకు కేసీఆర్‌ ప్రభుత్వం !
X
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెల్సిందే. తెలంగాణ మంత్రులు ఉమ్మడి పాలకులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ విమర్శలకి దీటుగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల నేతల మధ్య పరస్పర ఆరోపణల నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్‌ ఇవ్వనుంది. రాయలసీమ ఎత్తిపోతల పై సుప్రీం కోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న అక్రమ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టు లో సవాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. ఒకటి, రెండు రోజుల్లో సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటీషన్ వేయబోతుందట. కాగా.. నిన్ననే జలవివాదంపై ఏపీ సీఎం జగన్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణా అక్రమంగా వాడేస్తోందని దీన్ని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు.