Begin typing your search above and press return to search.

కేసీఆర్ లెక్క:డిప్యూటీ మేయర్ గా సెటిలర్?

By:  Tupaki Desk   |   9 Feb 2016 4:30 AM GMT
కేసీఆర్ లెక్క:డిప్యూటీ మేయర్ గా సెటిలర్?
X
గ్రేటర్ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ అధికారపక్షం తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసిందే. ప్రత్యర్థులకు ఏ మాత్రం అందని అంచనాలతో వ్యవహరించే ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే రీతిలో తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మేయర్ ఎవరన్న విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని.. డిప్యూటీ మేయర్ విషయంలో ఆయన సంచలన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ గా తెలంగాణేతరులకు కట్టబెట్టటం.. వీలైనంత వరకూ సెటిలర్ కు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

గ్రేటర్ లో మేయర్.. డిప్యూటీ మేయర్ల ఎంపికకు అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువగా ఉన్న తెలంగాణ అధికార పక్షం డిప్యూటీ మేయర్ పదవిని సెటిలర్లకు ఇవ్వటం ద్వారా.. తాజా ఎన్నికల్లో తమ పక్షాన నిలిచిన సెటిలర్ల ఓటు బ్యాంకును తమ సొంతం చేసుకునే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లతో పాటు.. ఎక్స్ అఫీయో సభ్యులతో కలిపి మొత్తం217 మంది సభ్యులు ఉండనున్నారు. మెజార్టీకి 109 మంది సభ్యులు ఉంటే సరిపోతుంది. గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాల్ని కైవశం చేసుకున్న టీఆర్ ఎస్.. ఎక్స్ అఫీషియో సభ్యుల రూపంలో మిగిలిన వారు అవసరమైన దాని కంటే ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో.. మేయర్.. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో తనకు తాను ఎవరి మీద ఆధారపడకుండా నిర్ణయం తీసుకునే వెసులుబాటు కేసీఆర్ కు ఉంది.

ఈ నేపథ్యంలో.. డిప్యూటీ మేయర్ పదవిని సెటిలర్ కు ఇచ్చే అంశంపై ఆయన కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. డిప్యూటీగా సెటిలర్ కు అవకాశం ఇచ్చిన పక్షంలో.. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్ల మనసుల్ని దోచుకోవటంతో పాటు.. వారి ఓటుబ్యాంకును తమ వైపుకు ఆకర్షించే వీలుందని.. తమ ప్రభుత్వంలో సెటిలర్.. నాన్ సెటిలర్ అన్న భేద భావం ఏమీ ఉండదన్న విషయాన్ని చేతల్లో నిరూపించినట్లు అవుతుందన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికి అంచనాగా ఉన్న ఈ వ్యవహారం కానీ వాస్తవరూపం దాలిస్తే కేసీఆర్ రాజకీయ చాణుక్యం ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి అందరికి తెలుస్తుంది.