Begin typing your search above and press return to search.
కేటీఆర్ కే కాదు...కవితకూ చాన్స్
By: Tupaki Desk | 22 Feb 2016 3:18 PM GMTఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాన్ని రచిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ ఈ క్రమంలో తన పిల్లలిద్దరికీ పరీక్ష పెట్టేందుకు రెడీ అయ్యారు. తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్, కూతురు-నిజామాబాద్ ఎంపీ కే కవితకు పుర ఎన్నికల పోరులో మార్గదర్శకత్వాన్ని అందిస్తూ వారి చేతుల మీదుగా ఆ కార్పొరేషన్‌లపై గులాబీ జెండా ఎగురవేయాలని కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ - ఖమ్మం బాద్యతలను కేటీఆర్ - కవితలకు అప్పజెప్పారని సమాచారం.
వరంగల్ కార్పొరేషన్‌లో గెలుపు బాధ్యతను మంత్రి కేటీఆర్ భుజస్కందాలపై పెట్టేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు ఇటీవల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో సమన్వయం చేసుకొని ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేలా కేటీఆర్‌కు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు గులాబీ వర్గాలు చెప్తున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్ని కల వ్యూహాం ప్రకారమే ఇక్కడ కూడా ప్రతి డివిజన్ కు ఓ ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. దీనితో పాటు రెండు, మూడు డివిజన్లకు ఓ మంత్రికి బాధ్యతలు అప్ప గించి గెలుపే లక్ష్యంగా పార్టీని సన్నద్ధం చేసే పనిలో మంత్రి కేటీఆర్ పడనున్నారు.
మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఖమ్మం పురపాలక గెలుపు బాధ్యతను ఎంపీ కవితపై అప్పగించేందుకు కేసీఆర్ డిసైడ్ అయ్యారు. కవితతో పాటు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నేత డి శ్రీనివాస్ కు ఎన్నికల బాధ్యతలను కట్టబెట్టనున్నారు. ఈ రెండు కార్పొరేషన్లకు కేటీఆర్, కవితలకు బాధ్యతలు అప్పగిస్తూనే స్థానిక నేతలను సమన్వయం చేసుకోవడం ద్వారా కారు జోరును కొనసాగించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.