Begin typing your search above and press return to search.
దేశపతికి ఎమ్మెల్సీ టికెట్.. మరో ఇద్దరిపైనా కేసీఆర్ కటాక్షం!
By: Tupaki Desk | 7 March 2023 6:26 PM GMTవిధేయులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరతాళ్లు వేశారు. ఉద్యమ కాలం నుంచి తనతోనే నడిచిన దేశపతి శ్రీనివాస్‌కు ఆయన ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అదేవిధంగా నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలకు కూడా కేసీఆర్ టికెట్లు ప్రకటించారు. త్వరలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వీరిపై వరాల జల్లు కురిపించారు. అసెం బ్లీలో బీఆర్ ఎస్ పార్టీకి భారీ బలం ఉన్న నేపథ్యంలో వీరి ఎన్నిక లాంఛనమే కానుంది. వీరు ఈ నెల 9న నామినేషన్లు వేయనున్నారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా కింద 3 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఎలిమినేటి కృష్ణారెడ్డి, వూల్లోళ్ల గంగాధర్‌గౌడ్, కురుమయ్యగారి నవీన్‌కుమార్‌ల పదవీ కాలం ఈ నెల 29న ముగియనుంది. దీంతో ఈ స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ.. 14న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఇక అదే నెల 23న కౌంటింగ్, ఫలితాలను వెల్లడించనున్నారు.
తుమ్మలకు తీవ్ర నిరాశేనా?
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావుకు ఈ దఫా ఎమ్మెల్సీ సీటును ఇస్తారనే ప్రచారం నిన్న మొన్నటి వరకు కూడా జోరుగా సాగింది. అయితే.. తాజా జాబితాలో ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. దీంతో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆయన పేరును పక్కన పెట్టారా? లేక.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారా? అనేది ఆసక్తిగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.