Begin typing your search above and press return to search.

కేంద్రాన్ని తప్పుబట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   7 Nov 2021 3:33 PM GMT
కేంద్రాన్ని తప్పుబట్టిన కేసీఆర్
X
ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై నెట్టిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని తప్పుబట్టారు. ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోందని, అందుకే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మంత్రి చెప్పారని తెలిపారు. ధాన్యాన్ని సంపూర్ణంగా కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. మిషన్‌ కాకతీయతో చెరువులను అద్భుతంగా తీర్చిదిదద్దుతామని ప్రకటించారు. తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితులు దారుణంగా ఉండేవని గుర్తుచేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఆహార కొరత రాకుండా ఎఫ్‌సీఐ ఏర్పాటైందని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోందని తప్పుబట్టారు.

మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఎకరానికి రూ.10 వేలు రైతుబంధు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. వరి కొనుగోళ్లపై కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని తప్పుబట్టారు. ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం రాష్ట్రాల దగ్గర లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే మెలికలు పెడుతోందని విమర్శించారు. రైతు బీమా పథకం ద్వారా రైతులకు ప్రీమియం కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ తెచ్చామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుర కొరత లేకుండా చేశామని తెలిపారు. రాష్ట్రంలో అద్భుతమైన వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో యాసంగి వరి పంట అంటే బాయిల్డ్‌ రైసే అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వమని చెబితేనే కొంటామని కేంద్రం చెప్పిందని కేసీఆర్‌ విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బాధ్యత లేదని దుయ్యబట్టారు. చాలా రోజులుగా బండి సంజయ్‌ అతిగా మాట్లాడుతున్నారని హెచ్చరించారు. బండి సంజయ్‌ కేంద్రం మెడలు వంచుతారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్‌ తన స్థాయి కాదు కాబట్టే తాను పట్టించుకోలేదన్నారు. ఏనుగులు వెళ్తుంటే.. కుక్కలు అరుస్తున్నాయని ఊరుకున్నానని చెప్పారు. ధాన్యం కొంటామని కేంద్రం ఆదేశాలు ఇస్తుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. గత యాసంగిదే 5 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందన్నారు. ఈ ఏడాది ఎంత ధాన్యం తీసుకుంటామనే క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది రైతులు 62 లక్షల ఎకరాల్లో వంటి పంట వేశారని, కోటీ 70 లక్షల టన్నుల ధాన్యం రాబోతోందని కేసీఆర్ తెలిపారు.