Begin typing your search above and press return to search.
సెటిలర్ల మనసును కేసీఆర్ గెలుచుకున్నట్లేనా?
By: Tupaki Desk | 2 Dec 2018 4:52 PM GMTతెలంగాణ ముందస్తు ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ వేదికగా టీఆర్ ఎస్ పార్టీ కీలక బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా నివసిస్తున్న సీమాంధ్రులు - సెటిలర్లను టార్గెట్ చేసుకొని వారి మనసు గెలుచుకునేలా కేసీఆర్ ప్రసంగం సాగిందనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ వేదికగా ఈ నగరం ఏ ఒక్కరి సొంతం కాదనే మాటను వెల్లడించడం ద్వారా ఈ భావన సొంతం చేసుకున్నారని చెప్తున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ ``హైదరాబాద్ విశ్వ నగరం - ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ నగరం నిజాం కాలం నుంచే సర్వ మతాలకు - సర్వ కులాలకు సర్వ ప్రజలకు నివాసం ఉన్న నగరం. ప్రతీ రాష్ట్రం వాళ్లు హైదరాబాద్ లో నివాసం ఉన్నారు. ఆంధ్రా రాయలసీమ నుంచి వచ్చి నివాసం ఉంటున్న సోదరులు సంతోషంగా ఈ నగరంలో ఉన్నరు. గతంలో తెలంగాణ ఏర్పడే సమయంలో చాలా అపోహలు సృష్టించినారు. అనవసరమైన భయాలను సృష్టించినారు. కాని నాలుగున్నరేండ్ల పాలనలో మన తెలంగాణ ప్రభుత్వం అటువంటిది ఏదీ లేదని నిరూపించింది. కాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య విధ్వేశాలను సృష్టించే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నవారంతా తెలంగాణ బిడ్డలే. రాష్ట్రం వచ్చిన నాటి నుంచి ఏ విధమైన ఆచరణ నిర్వహించినమో మన కండ్ల ముందరే ఉంది. చంద్రబాబు నాయుడు అనవసరంగా వచ్చిన మాకు మసి పూసి మా నొసటికి ఒక బోర్డు కట్టి మమ్ములను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నాడని ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి నివాసం ఉంటున్న కుటుంబాలు బాధపడుతున్నాయి`` అంటూ ఆంధ్రుల మనసులోని భావాలను తన రూపంలో వెల్లడించారు.
స్వార్థ రాజకీయాల కోసం - కుటిల రాజకీయల కోసం - కుళ్లు రాజకీయాల కోసం - హైదరాబాద్ లో ఉన్న తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడని కేసీఆర్ మండిపడ్డారు. ``హైదరాబాద్ లో నివాసం ఉండే ప్రతి ఒక్కరూ హైదరాబాదీలే. కేసీఆర్ మీతో ఉన్నాడు. ఏ నాయకుడి ప్రలోభాలకు - మాయమాటలకు లొంగకుండా టీఆర్ ఎస్ పార్టీని గెలిపించాలి. చంద్రబాబు నాయుడుకు ఏం అవసరం ఉందని కుట్రలు చేస్తున్నాడు. ఆయనకు రాష్ట్రం లేదా. ఆయనకు 175 నియోజకవర్గాల్లో చెప్పలేనంత పని ఉంది. అక్కడ పనిచేయకుండా ఇక్కడ పోటీ చేసే 13 స్థానాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా. ఈ వెకిలి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును నగరంలోని విజ్ఞులు - ఆంధ్రా - రాయలసీమ వాసులు ఆలోచించాలి. ఏ రాజకీయాలను ఆశించి చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నాడో చెప్పాలి. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్నికలను వినియోగించుకుంటున్నాడు. ప్రశాంతంగా బ్రతికే ప్రజలను విడదీయాలని చూస్తున్నాడు. చంద్రబాబు - కాంగ్రెస్ వాళ్లు డూప్లికేట్ సర్వేలు విడుదల చేసి తెలంగాణ ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కుట్రల చంద్రబాబుకు బుద్ధి చెప్పే విధంగా టీఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మనం వందకు పైగా సీట్లతో గెలిచి అసెంబ్లీలో మన పాలన మనం చేసుకోబోతున్నాం`` అని వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్య పరిణితిని ప్రదర్శించి - సమకాలీన రాజకీయాలను అవగాహన చేసుకుని ఓటింగ్ లో పాల్గొనాలని రాష్ట్ర ప్రజలకు - మేదావులైనటువంటి జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని కేసీఆర్ అన్నారు. ``ప్రజాస్వామ్య పరిణితి ఉన్న దేశంలో గెలవాల్సింది పార్టీలు - అభ్యర్థులు కాదు - ప్రజలు గెలువాలే - ప్రజల వాంచలు గెలవాలె. ప్రజల అభిష్టిం గెలవాలే. అది చాలా ముఖ్యం. ఐదు సంవత్సరాలు కూడా ప్రజల ఎజెండా అమలు జరిగి అద్భుతమైన పాలన సాగుతుంది. జంట నగరాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. జంట నగరాలలో జీహెచ్ ఎంసీ తీర్పు పునరావృతం కాబోతుంది`` అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.