Begin typing your search above and press return to search.
అంతా 6.. కేసీఆర్ సచివాలయ సెంటిమెంట్
By: Tupaki Desk | 24 July 2020 2:00 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ 6. ఆయన కారు నంబర్లు 6666. ఇలా సర్వం ఆరు వచ్చేలా ఆయన తన అదృష్ట సంఖ్యను వాడేస్తుంటారు. ఇప్పుడు తన కలల సచివాలయంలోనూ 6 సంఖ్యనే మొత్తం వాడేస్తుండడం విశేషంగా మారింది.
కేసీఆర్ కలల సచివాలయాన్ని 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘6’ అంతస్థుల్లో నిర్మాణం చేయనున్నారు. అంతేకాదు.. సచివాలయం చుట్టూ ఏకంగా 60 అడుగుల వెడల్పు గల రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు.
ఈ కొత్త సచివాలయంలో ‘6’ కాన్ఫరెన్స్స హాళ్లు.. ‘6’ డైనింగ్ హాళ్లు.. ‘6’ పార్కులు.. 60 మీటర్ల గుమ్మటం ఇలా అన్నింట్లోనూ 6 ఉండేలా సచివాలయాన్ని నిర్మిస్తుండడం విశేషంగా మారింది.
ప్రతీది వాస్తు ప్రకారమే కొత్త సచివాలయాన్ని కేసీఆర్ నిర్మిస్తుండడం విశేషంగా మారింది. సచివాలయానికి తూర్పున.. ఉత్తర మాత్రమే రహదారులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక సచివాలయం వెనుకాల ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, పోస్టాఫీస్, ఆసుపత్రి, చిన్నారుల సంరక్షణ కేంద్రాలు.. ఉద్యోగ సంఘాల కార్యాలయాలు.. సందర్శకుల హాళ్లు ఉండనున్నాయి. తాజాగా కేసీఆర్ చేసిన మార్పులకు వచ్చే వారంలో ఆమోదం తెలిపి 500 కోట్ల బడ్జెట్ తో 10 నెలల్లోనే దీన్ని నిర్మించడానికి సర్కార్ రెడీ అవుతోంది. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ లు ఆస్కార్, పొన్నిలు ఈ నిర్మాణాన్ని తీర్చిదిద్దుతున్నారు.