Begin typing your search above and press return to search.
బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ తొలి ఎన్నిక
By: Tupaki Desk | 2 March 2023 7:00 AM GMTతెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ గా మారాక తొలి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ గా మారాక జరుగుతున్న తొలి ఎన్నికను సవాల్ గా తీసుకున్నారు. తెలంగాణ వెలుపల తన మొదటి ఎన్నికలకు నాయకత్వం వహించబోతున్నారు.
త్వరలో జరగనున్న మహారాష్ట్ర జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు బాల్క సుమన్, జోగు రామన్న, గోడం నగేష్‌లతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమై మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. మహారాష్ట్రలోని ప్రతి సెగ్మెంట్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని, ఇది కొత్తగా ప్రారంభించిన పార్టీకి సాహసోపేతమైన చర్యగా భావిస్తున్నారు.
హోలీ పండుగ పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ బలగాలు విస్తృతంగా పర్యటిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని, చివరకు ఓట్లను పొందేందుకు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని కేసీఆర్ తన బలగాలను కోరినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ చీఫ్ ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2-3 నియోజకవర్గాలకు ఒక బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్‌ని కూడా నియమించారు.
బీఆర్ఎస్ కార్యకలాపాలు విస్తరించేందుకు కేసీఆర్ గత నెల 5న నాందేడ్ లో సభ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడానికి పలు హామీలు ఇచ్చారు. మహారాష్ట్రంలో ఇప్పటికీ నీటి కొరత ఉందని, బీజేపీ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అయితే అవసరమైతే మహారాష్ట్రకు తెలంగాణలోని నీళ్లు ఇస్తామన్నట్లు కేసీఆర్ వ్యాఖ్యానించారరు.. తెలంగాణలో అమలవుతున్న రైతుభీమా, రైతుబంధు సహా ఉచిత కరెంట్ ను అస్త్రంగా మార్చి మహారాష్ట్ర రైతులను ఆకట్టుకోవాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ముందుకెళుతున్నారు. మరి మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎంత మేరకు సత్తా చాటుతుందన్నది వేచిచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.