Begin typing your search above and press return to search.
కవిత ఓడిందని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల పార్టీ.?
By: Tupaki Desk | 26 May 2019 5:58 AM GMTఎందుకు ఏడుస్తున్నావ్ అంటే.. మొగుడు కొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు’ అన్నదట వెనుకటికి ఒకావిడ.. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ప్రత్యర్థులు, తోటి వారు కూడా ఓడినందుకు తెగ సంతోషంగా ఉన్నారట కొందరు. పార్టీలన్నీ ఇప్పుడు తమ ఓటమికి పోస్టుమార్టం మొదలు పెట్టారు. ప్రత్యర్థులు, తమ పై వారు ఓడిపోయినందుకు కొందరు పార్టీలు కూడా చేసుకోవడం విశేషం.. కానీ స్వపక్షం వారిని కూడా ఓడగొట్టాలన్న కసి ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఉండడం సంచలనంగా మారింది.
తాజాగా కేసీఆర్ తన కూతురు కవిత నిజామాబాద్ లో ఓటమికి గల కారణాలపై ఆరాతీశారట.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారట.. ప్రధానంగా కవిత ఓటమికి ఎమ్మెల్యేలు సహకరించలేదని తేలిందట. అంతేకాదు.. కవిత ఓడిపోయాక రాత్రి ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి పార్టీ చేసుకొని ఎంజాయ్ చేశారని కేసీఆర్ కు ఇంటెలిజెన్స్ రిపోర్టులు అందాయట.. దీంతో ఆ ఇద్దరిపై అగ్గి మీద గుగ్గిలమయ్యారట కేసీఆర్. సీరియస్ గా ఉన్న కేసీఆర్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోందట..
కవిత పోటీచేసిన నిజామాబాద్ పార్లమెంట్ లో ఏడుకు ఏడు సీట్లు టీఆర్ఎస్సే గెలిచింది. నిజామాబాద్ అర్బన్ - రూరల్ - బోధన్ - ఆర్మూర్ - కోరుట్ల - జగిత్యాలలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ నిజామాబాద్ అర్బన్ - బోధన్ తప్పితే కవితకు ఏ నియోజకవర్గంలో మెజారిటీ రాలేదు. పైగా ఇద్దరు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కవితకు ఓట్లు పడకుండా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థికి సహకరించారని ఓట్లు వేయించారని కేసీఆర్ కు నివేదిక అందిందట. నిజామాబాద్ పరిధిలో కవిత ఆధిపత్యం.. తమను డమ్మీని చేసి మొన్నటి ఎన్నికల్లో ఆడుకుందని వాళ్లు ఇలా ప్రతీకారం తీర్చుకున్నారని సమాచారం.
కవిత ఓడిపోగానే ఆ ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అర్థరాత్రి పార్టీ చేసుకొని సెలబ్రేట్ కూడా చేసుకున్నారని సమాచారం కేసీఆర్ కు అందిందట.. ప్రత్యర్తులనే వదలని కేసీఆర్.. సొంత పార్టీ నేతల వికృత చేష్టలపై సీరియస్ గా ఉన్నాడట.. ఇప్పుడు ఆ ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్య తీసుకుంటాడన్నది టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.