Begin typing your search above and press return to search.
బాబును మళ్లీ తరిమికొట్టండి అంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 21 Nov 2018 4:10 PM GMTటార్గెట్ చంద్రబాబు నాయుడు రూపంలో తగులాబీ దళపతి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. మలివిడత ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న చంద్రశేఖర్ రావు మూడో రోజు నిర్వహించిన సభల్లో తన విమర్శల విశ్వరూపం చూపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల - దేవరకొండ - నకిరేకల్ - భువనగిరి - మెదక్ లో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు. కాంగ్రెస్ - టీడీపీల వైఖరిని తూర్పారబట్టారు. కాంగ్రెస్ చేతగాని తనం వల్ల తెలంగాణలో ఉడుముల్లా జొచ్చి దోచుకోవాలని చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ మహాకూటమి పేరుతో చంద్రబాబును భుజాల మీద మోసుకువచ్చిందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. జానారెడ్డి - ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేతగాక చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్నారని నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా ఆంధ్రా - తెలంగాణ అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. ఆంధ్రావాడి కత్తితో పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను అమరావతికి తొత్తుగా మార్చాలని చూస్తున్నారని, మహాకూటమి పేరుతో వస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఒకసారి తాను తరమికొట్టానని - ఇప్పుడు రెండోసారి పాలమూరు ప్రజలు తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రూపంలో తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందని, ప్రజలందరూ సీరియస్ గా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. తెచ్చిన కాంగ్రెస్ ను - వచ్చిన చంద్రబాబును చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి. మిమ్మల్ని వదల బొమ్మాలీ.. వదల అంటున్నడు. వదిలి పెట్టడట. మరి ఎలా తరిమికొట్టాలో మీరే నిర్ణయం చేయాలి. నేనైతే నావంతుగా ఒకసారి తరమికొట్టాను. ఇప్పుడు తరమికొట్టే బాధ్యత మాత్రం మీమీదే ఉన్నది.’’ అని పేర్కొన్నారు. అడుగడుగునా తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడే చంద్రబాబు ఇప్పుడు మన ఇంటికి వచ్చి మనల్ని కొట్టిపోయేందుకు చూస్తున్నారని చెప్పారు. మీ వేలితో మిమ్మల్ని పొడిచేయాలనే ఆలోచనతో పాలమూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులను పోటికి దించారని చెప్పారు. జిల్లాలను 9 ఏండ్లు దత్తత తీసుకున్న చంద్రబాబు వలసల జిల్లాగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని పాలమూరులో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. నీళ్లు రానీయకుండా - అభివృద్ధి జరగకుండా అడుగడుగునా అడ్డుకున్నారని చెప్పారు. నీళ్లు రానివ్వని వాడికి ఇప్పుడు ఓట్లు కావాలా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవాలని చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. అలాంటి తెలంగాణ చంద్రబాబుకు అవసరమా అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ - బీజేపీ రెండూ తోడు దొంగలేనని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యం తగ్గాలని - రాష్ట్రాల అధికారాలు పెరగాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి హిందూ ముస్లిం తేడా అనే బీమారి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని చెప్పారు. కేంద్ర రాష్ట్రాల హక్కులను హరించి కర్ర పెత్తనం చేస్తున్నాయన్న ఆయన ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాల్సి ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ - కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలన్నారు. దేవరకొండ ప్రాంతం ఫ్లోరైడ్ రక్కసితో ఇబ్బంది పడిందన్న ఆయన - నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి- జానారెడ్డి ఉన్నప్పటికీ ప్రాజెక్టులు కట్టలేదన్నారు. కంటి వెలుగు విజయవంతం అయినట్టే ఇఎన్ టీ వైద్యులు ప్రతి ఇంటికి వచ్చి ఉచిత వైద్యం అందిస్తారని - త్వరలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని చెప్పారు. దేశం గర్వించదగ్గ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన, ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.