Begin typing your search above and press return to search.
బాబు వదల బొమ్మాళి..ఇది మామూలు ఎన్నిక కాదు
By: Tupaki Desk | 21 Nov 2018 11:45 AM GMTతెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా - గులాబీ దళపతి కేసీఆర్ తన జోరు పెంచారు. వరుసగా సభలు నిర్వహిస్తూ వస్తున్న కేసీఆర్ తాజాగా తన సభల్లో జోరు పెంచారు. జడ్ చర్ల సభలో ఆయన మాట్లాడుతూ దూకుడు పెంచారు. ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ నాలుగున్నరేళ్లలో మనం రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ``మన ఇంటికి వచ్చి మనల్ని కొట్టిపోతానని చంద్రబాబు అంటున్నారు. అటువంటి చంద్రబాబుకు మనం ఓటు వేద్దామా అనేది మీరే ఆలోచించాలి. నేను తెలంగాణ బిడ్డను మన పోరాటంలో మీరు కూడా భుజం కలపాలి. అర్థమయి కూడా అర్థం కానట్లు నటిస్తే మన బతుకులు వ్యర్థం అవుతాయి. మీ వేలితోనే మీ కళ్లు పొడిచేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అవసరమైన సమయంలో ప్రజలు పోరాటం చేయాలి. తెలంగాణ వచ్చే వరకు విరామం చెందను.. ఉద్యమ జెండాని దించను`` అని టీడీపీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శల వర్షం కురిపించారు.
మళ్లీ చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతాడని కేసీఆర్ ప్రశ్నించారు. ``మనకు నీళ్లు రానీయరు గానీ మన ఓట్లు కావాలా..?. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. ఉద్దండాపూర్ దగ్గర రిజర్వాయర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయి. చంద్రబాబును ఎలా తరిమికొట్టాలో పాలమూరు ప్రజలకే వదిలేస్తున్నా. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవాలని నాగం జనార్ధన్ రెడ్డి 30 ఉత్తరాలు రాసిండు. ఇంకా దుర్మార్గులు మన దగ్గరే ఉన్నారు. ఉడుముల్లా జొచ్చి దోచుకోవాలని చూస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. చంద్రబాబు వదలా బొమ్మాళి.. వదలా అంటున్నాడు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసిండు`` అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో మోసపోతే గోసపడుతామని కేసీఆర్ వివరించారు. ``కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కథ పాతే కథే అయితది. కరెంట్ కోసం 30ఏళ్లు ధర్నాలు చేశాం. ఆనాడు కరెంట్ ఉంటే వార్త.. ఇవాళ కరెంట్ పోతే వార్త.`` అని అన్నారు.