Begin typing your search above and press return to search.

కొండా సీటుకు ఎసరుపెడుతున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   9 March 2019 11:07 AM GMT
కొండా సీటుకు ఎసరుపెడుతున్న కేసీఆర్
X
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే.. ఇక ఎన్నికల ముందు తనకు హ్యాండిచ్చి పక్కా పార్టీలోకి జంప్ అయిన అప్పటి టీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ దృష్టిసారించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు ధోకా ఇచ్చారు. అందుకు బదులుగా కేసీఆర్ వారికి పక్కా స్కెచ్ తో దిమ్మదిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. వారి స్థానాలు తిరిగి టీఆర్ఎస్ కైవసం చేసుకోనులా ఎత్తుగడలు వేస్తున్నారు.

ముఖ్యంగా చేవేళ్ల ఎంపీ సీటుపై కేసీఆర్ నజర్ వేసినట్లు తెల్సింది. గతంలో ఇక్కడి నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీచేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపొందారు. కాగా కిందటి ఎన్నికల ముందు ఆయన అనుహ్యంగా టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో అక్కడ టీఆర్ఎస్ పార్టీకి బలమైన అభ్యర్థి అవసరం ఏర్పడింది. ఈ స్థానంలో ప్రముఖ వ్యాపారవేత్త రంజిత్ రెడ్డిని పోటీకి దించాలని కేసీఆర్ యత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ స్థానం నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి రంజిత్ రెడ్డికి కేసీఆర్ లైన్ క్లియర్ చేస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించాడు. దీంతో ఈ స్థానానికి నరేందర్ రెడ్డి రాజీనామా చేశారు. తద్వరా ఈ ఎమ్మెల్సీని నరేందర్ రెడ్డి సోదరుడు మహేందర్ రెడ్డికి కట్టబెట్టనున్నారని తెలుస్తోంది.

ఏదిఏమైనా చేవేళ్ల ఎంపీ సీటు విషయంలో పట్నం సోదరుల అభిప్రాయం తీసుకొని ఎంపీగా రంజిత్ రెడ్డిని ఖరారు చేసేందుకు ప్రణాళికలను కేసీఆర్ సిద్ధం చేశారని విశ్వసనీయ సమాచారం. ఎన్నికల నాటికి ఈ సమీకరణలు మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరీ.