Begin typing your search above and press return to search.
చంద్రబాబును డామినేట్ చేస్తున్న కేసీఆర్
By: Tupaki Desk | 17 July 2015 8:41 AM GMT విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పైచేయి సాధిస్తున్నారు. ఈ సంస్థల విషయంలో ప్రతిసారీ తెలంగాణదే పైచేయి అవుతోంది. వారికి నచ్చినట్లు చేసుకుంటున్నా అడ్డుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమవుతోంది. విభజన తరువాత ఇచ్చిన ఏడాది గ్రేస్ పీరియడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు.. ఈలోగా కేసీఆర్ మొత్తం చుట్టబెట్టేశారు.
పదో షెడ్యూల్‌లో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. వీటిలో విద్యా, శిక్షణా సంబంధిత సంస్థలున్నాయి. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థ ఆ రాష్ట్రానికే చెందుతుందని విభజన చట్టంలో స్పష్టంగా చెప్పింది. కాగా, విభజన చట్టం అమలులోకి వచ్చిన ఏడాదిపాటు ఈ సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలందించాల్సి ఉంటుంది. ఈలోపు రెండు రాష్ట్రాల్లో ఆయా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాది గడవకముందే పలు సంస్థలపై వివాదాలు తలెత్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందులో అత్యధిక శాతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. చట్టప్రకారం తెలంగాణ భూభాగంలో ఉన్న సంస్థలకు ఏపీ ప్రభుత్వమే కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడున్న సంస్థల నుంచి ఉద్యోగులు, అప్పులు, ఆస్తుల విభజన చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వైపుగా దృష్టి పెట్టలేదు. దీంతో ఏడాది గడువు ముగియగానే తెలంగాణ ప్రభుత్వం తన భూభాగంలో ఉన్న అన్ని సంస్థలపైనా హక్కు తమదే అని ప్రకటించుకుంది. ఇటీవలే తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు తమవేనని, ఏపీ విద్యార్థులకు సేవలందించబోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంస్థల సేవలు కావాలంటే జనాభా ప్రాతిపదికన ఖర్చులు ఎపి ప్రభుత్వం భరించాలని, అందుకు అనుగుణంగా అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాలని తేల్చిచెప్పింది.
దీనిపై ఏపీ ప్రభుత్వం న్యాయ సలహా కోరగా అక్కడా అదే సమాధానం వచ్చింది. ఏడాది గడువు ముగిసినందున ఆయా సంస్థల సేవల కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడమే మేలని న్యాయ శాఖ తేల్చిచెప్పింది. ఒకవేళ ఎంవోయూ కుదుర్చుకోవడం ఇష్టం లేకపోతే అవసరమైన మేరకు కొత్త సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇంకా, సర్వే అకాడమీ కూడా తమదేనని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం కొత్త అధికారిని నియమించుకుంది. దీంతో పదో షెడ్యూల్‌లోని ఏ సంస్థ నిధుల నుంచి కూడా ఏపీకి వాటా వస్తుందన్న నమ్మకం కలగడం లేదు. దీంతో ఈ విషయంలో చంద్రబాబు బాగా వెనుకబడిపోయినట్లు అర్థమవుతోంది.