Begin typing your search above and press return to search.

ఏపీకి మేలు చేస్తున్న కేసీఆర్‌.. ఎలాగంటే!

By:  Tupaki Desk   |   6 Sep 2021 11:30 PM GMT
ఏపీకి మేలు చేస్తున్న కేసీఆర్‌.. ఎలాగంటే!
X
అదేంటి? అనుకుంటున్నారా? ఏపీ అంటేనే.. నిప్పులు చెరిగే.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఇప్పుడు ఏపీకి మేలు చేసేలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంటి? అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది కిటుకు .. అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌న ప్ర‌యోజ‌నాల కోస‌మే.. నిరంత‌రం.. ప‌నిచేస్తార‌ని పేరున్న కేసీఆర్‌.. తాజాగా చేసిన ప‌ని..ప‌రోక్షంగా ఏపీకి కూడా మేలు చేస్తుంద‌ని చెబుతున్నారు. అదెలా అంటే.. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేసీఆర్.. అక్క‌డ తెలంగాణ భ‌వ‌న్‌కు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం.. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతోను, కేంద్ర హోం మంత్రి.. అమిత్ షా తోనూ భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న వారితో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

మ‌రీ ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి.. దాదాపు 8 ఏళ్లు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న హామీల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌లేద‌ని.. కేసీఆర్‌.. కేంద్ర హోం మంత్రి ముందు ప్ర‌స్తావించిన‌ట్టు తెలిసింది. ఒక‌వైపు తెలంగాణ కోసం వరాలు అడుగుతూనే మ‌రోవైపు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావించిన‌ట్టు తెలిసింది. అయితే చట్టంలో తెలంగాణకు ఇస్తామన్న వాటిపైనే కేసీఆర్ డిమాండ్ చేస్తున్నా.. అసలు దాన్ని అమలు చేయ‌డం ప్రారంభిస్తే, తెలంగాణ కంటే ఏపీకే కేంద్రం ఎక్కువగా మేలు చేయాల్సి వస్తుంది. ఒకవేళ కేసీఆర్ ఒత్తిడి ఫలించి కేంద్రం విభజన చట్టాన్ని పట్టించుకుని ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తే అది తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ లాభం అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏడేళ్లు గడిచినా ఇంకా విభజన చట్టాన్ని ఎందుకు అమలు పరచడంలేదంటూ ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వ‌చ్చినఅవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ప్రధాని మోడీ సహా, అమిత్ షా ముందు కేసీఆర్ త‌న‌ కోర్కెల చిట్టా పెట్టారు. జిల్లాల సంఖ్యను పెంచుకున్నామని, దానికి అనుగుణంగా ఐపీఎస్ లను పెంచాలని కోరారు. గిరిజన యూనివర్శిటీ సహా, ఇతర వ్యవహారాలను కూడా త్వరగా తేల్చాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు స‌మాచారం. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయం చేయాలని కేసీఆర్ చేస్తున్న డిమాండ్ ప‌రోక్షంగా ఏపీ విష‌యంలోనూ మేలు చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు .

ఎందుకంటే.. విభ‌జ‌న చ‌ట్టం ఇరు రాష్ట్రాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం. సో.. తెలంగాణ‌కుమాత్ర‌మే విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను అమ‌లు చేసి.. ఏపీని వ‌దిలేసే ప‌రిస్థితి వ‌స్తే.. బీజేపీపైనా.. మోడీపైనా ఒత్తిడి పెరుగుతుంది. సో.. ఖ‌చ్చితంగా తెలంగాణకు మేలు చేస్తే.. ఏపీకి మేలు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న ప‌రిశీల‌కులు.. కేసీఆర్ చేసిన ప్ర‌య‌త్నం.. ఫ‌లిస్తే..ఏపీకి ఆయ‌న ప‌రోక్షంగా మేలు చేసిన‌ట్టేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.