Begin typing your search above and press return to search.

కేసీయార్ డేరింగ్ స్టెప్... విపక్షం షాక్...?

By:  Tupaki Desk   |   25 Jun 2023 12:00 PM GMT
కేసీయార్ డేరింగ్ స్టెప్... విపక్షం షాక్...?
X
తెలంగాణా సీఎం బీయారెస్ అధినేత కేసీయార్ డేరింగ్ అండ్ డేషింగ్ కి పెట్టింది పేరు. ఆయన ఆలోచనలు పాదరసం కన్నా స్పీడ్ గా ఉంటాయి. ఒంటి చేత్తో తెలంగాణాను తెచ్చిన కేసీయార్ రెండు సార్లు బీయారెస్ కి అధికారాన్ని కూడా దక్కించుకున్నారు. హ్యాట్రిక్ కొట్టి సౌతిండియాలోనే తన లాంటి మొనగాడు లేడని చెప్పనున్నారు. జయలలిత, ఎన్టీయార్ వరసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. మూడవసారి రాలేకపోయారు.

ఇక సౌత్ లో మరే నాయకుడు కూడా ముమ్మారు పవర్ లోకి వరసగా రాలేదు. దాంతో కేసీయార్ ఆ రేర్ ఫీట్ ని సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మరో వైపు చూస్తే ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లలో ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. దాంతో కేసీయార్ ఏ రాజకీయ పార్టీ చేయని నిర్ణయం తీసుకోనున్నారు అని అంటున్నారు.

ఒకే దఫాలో మొత్తం 119 మంది అభ్యర్ధులను డిక్లేర్ చేయడం ద్వారా విపక్షాలకు గట్టి షాక్ ఇవ్వాలని కేసీయార్ చూస్తున్నారని అంటున్నారు. బీయారెస్ కి అసెంబ్లీలో వందకు మించి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి వారిలో 90 మంది దాకా సిట్టింగులకు టికెట్లు ఇచ్చి మార్చితే పది నుంచి పదిహేను మందిని మాత్రమే పక్కన పెట్టాలని కేసీయార్ చూస్తున్నారు అని అంటున్నారు.

అంటే సిట్టింగులందరికీ దాదాపుగా టికెట్లు ఇవ్వాలని కేసీయార్ తీసుకోబోయే నిర్ణయం సంచలనమే అంటున్నారు. సిట్టింగుల పట్ల వ్యతిరేకత ఉంటుందని, అందునా రెండు సార్లు ఉన్న వారి మీద తీవ్రంగా ఉంటుంది కాబట్టి కనీసంగా సగానికి సగం మందిని మార్చేస్తారు అని ప్రచారం జరిగినా కేసీయార్ మాత్రం అందరికీ టికెట్లు అంటున్నారు.

ఈ మేరకు ఆయన సర్వేలు చేయించి మరీ తన వారు అంతా గెలుస్తారు అన్న నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ ధీమాతోనే ఆయన టోటల్ అభ్యర్ధులను ఒక్కసారిగా ప్రకటించబోతున్నారు అని అంటున్నారు. అధికార పార్టీ నిజానికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడాలి. ఎవరిని కాదన్నా వారు వెళ్ళి విపక్ష శిబిరంలో చేరుతారు. కానీ కేసీయార్ ముందుగానే టోటల్ లిస్ట్ ప్రకటించడం అంటే చాలా ధీమాగా ఉన్నట్లుగానే కనిపిస్తున్నారు.

అదే టైం లో ఆయన ఎన్నికలకు మూడు నెలల ముందుగానే వారిని జనంలోకి పంపిస్తున్నారు అన్న మాట. కావాల్సినంత టైం వారికి ప్రచారానికి దొరుకుతుంది. ఇక ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్ బీజేపీలకు అధినాయకత్వాలు ఢిల్లీలో ఉన్నారు. చివరి నిముషం వరకూ ఎంపిక తెగదు. ఆ విధంగా వారికి ఇబ్బంది అవుతుందా అన్న చర్చ వస్తోంది.

అందుకే కేసీయార్ దూకుడుగా అభ్యర్ధులు అందరినీ ప్రకటిస్తారు అని అంటున్నారు. అంతే కాదు పొత్తులు ఎవరితో ఉండవని చెప్పనున్నారట. అంటే మజ్లీస్ పార్టీతో గత ఎన్నికల్లో పొత్తులు ఉన్నాయి. ఈసారి కామ్రేడ్స్ తో పొత్తులు అని అనుకున్నారు. కానీ కేసీయార్ ఎవరూ వద్దు ఒంటరిగానే పోటీ అంటున్నారు. మొత్తానికి కేసేయార్ విపక్షాలకు అనేక రకాలుగా షాకులు ఇచ్చేలాగానే ఉన్నారని అంటున్నారు.

మొత్తానికి వారం రోజుల లోపల కేసీయార్ మొత్తం అభ్యర్ధుల జాబితాను ప్రకటించి విపక్షాలను ఖంగు తినిపిస్తారు అని అంటున్నారు. ఇక టికెట్లు రాని వారిని ఎలగోలా బుజ్జరించి దారికి తెచ్చుకుంటారని ఆ విధంగా హ్యాట్రిక్ కొట్టడానికి పక్కా ప్రణాళికతో కేసీయార్ ముందుకు సాగుతున్నారని అంటున్నారు.