Begin typing your search above and press return to search.

జ‌స్టిస్ సుభాష‌ణ్ రెడ్డిని చూడ‌టానికి కేసీఆర్ వ‌స్తార‌ట‌!

By:  Tupaki Desk   |   1 May 2019 5:47 AM GMT
జ‌స్టిస్ సుభాష‌ణ్ రెడ్డిని చూడ‌టానికి కేసీఆర్ వ‌స్తార‌ట‌!
X
ఒక ప్ర‌ముఖుడు మ‌ర‌ణిస్తే.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రావ‌టం.. నివాళులు అర్పించ‌టం.. వారి కుటుంబానికి త‌న సంతాపాన్ని తెలియ‌జేయ‌టం మామూలే. అలాంట‌ప్పుడు ఇప్పుడీ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఉందా? అంటే ఉంద‌ని చెప్పాలి. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మామూలు సీఎం కాదు. ఆయ‌న ధోర‌ణి భిన్నంగా ఉంటుంది.

ప్రాంతాల ప‌రిధుల్ని ప‌ట్టించుకోని రీతిలో కొంద‌రు ప్ర‌ముఖులు ఉంటారు. అలాంటి వారిలో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి లెజెండ్ అయిన అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌ర‌ణిస్తే..ఆయ‌న‌కు నివాళులు ప‌లికేందుకు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ రాక‌పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఆ విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ రాష్ట్రంలో మ‌ర‌ణించిన ప‌లువురు ప్ర‌ముఖుల నివాళులు అర్పించేందుకు కేసీఆర్ హాజ‌రు కాక‌పోవ‌టం ప‌లుమార్లు చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంటుంది.

తాజాగా మ‌ర‌ణించిన జ‌స్టిస్ సుభాషణ్ రెడ్డికి నివాళులు అర్పించేందుకు కేసీఆర్ వ‌స్తారా? అంటే.. క‌చ్చితంగా వ‌స్తార‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వ‌స్తోంది.

ప‌క్కా హైద‌రాబాదీగా.. ప్ర‌ముఖ న్యాయ‌కోవిదుడిగా.. మాన‌వ‌హ‌క్కుల సంఘం ఛైర్మ‌న్ గా.. తెలంగాణ తొలి లోకాయుక్త‌గా వ్య‌వ‌హ‌రించిన సుభాష‌ణ్ రెడ్డికి కేసీఆర్ కు మ‌ధ్య భావోద్వేగ అనుబంధం ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో నిర‌స‌న దీక్ష చేసిన కేసీఆర్ ను ఖ‌మ్మంలో పోలీసులు అరెస్ట్ చేయ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను వెంట‌నే హైద‌రాబాద్ కు పంపాల్సిందిగా.. నాడు మాన‌వ‌హ‌క్క‌లు సంఘం ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన జ‌స్టిస్ సుభాష‌ణ్ రెడ్డి ఆదేశాలు.. తెలంగాణ ఉద్య‌మాన్ని మ‌రో ద‌శ‌కు వెళ్లేలా చేశాయ‌ని చెప్పాలి.

ఖ‌మ్మం నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చిన కేసీఆర్‌.. నిమ్స్ లో దీక్ష కొన‌సాగించ‌టం.. ఆ సంద‌ర్భంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టం తెలిసిందే. ఇదొక్క అంశ‌మే కాదు.. వ్య‌క్తిగ‌తంగా.. వృత్తిప‌రంగా మ‌చ్చ లేని సుభాష‌ణ్ రెడ్డి లాంటి ప్ర‌ముఖుడికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హోదాలో నివాళులు అర్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అందుకే.. త‌న తీరుకు భిన్నంగా సీఎం కేసీఆర్‌.. సుభాష‌ణ్ రెడ్డికి నివాళులు అర్పిస్తార‌ని చెబుతున్నారు.