Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ ఫైటింగ్.. కేసీఆర్ నజర్

By:  Tupaki Desk   |   31 May 2020 3:39 PM GMT
ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ ఫైటింగ్.. కేసీఆర్ నజర్
X
తెలంగాణలో కేసీఆర్ లాంటి బలమైన నేత సీఎంగా ఉన్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉంది.. అనుభవిస్తోంది. అలాంటి పార్టీలో అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఇక విభేదాలు ఎక్కడివి అని అనుకోకండి.. ఉన్నాయి.. ఆధిపత్య పోరుతో టీడీపీలో విభేదాలు పొడచూపుతున్నాయి. నాయకులు ఘర్షణ పడుతున్నారు. ఇప్పుడు ఆ నేతల మధ్య పరోక్ష యుద్ధమే సాగుతోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. టీఆర్ఎస్ లో రెండు గ్రూపులుగా మారి ఒకదానికి ఎమ్మెల్యే - మరో దానికి ఎమ్మెల్సీ నాయకత్వం వహిస్తూ తొడగొట్టుకుంటున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ - ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య నివురుగప్పిన నిప్పులా రాజకీయ విభేదాలు బహిర్గతమవుతున్నాయి.

రెండు గ్రూపులు వేర్వేరుగా టీఆర్ ఎస్ కార్యక్రమాలు చేస్తూ విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకు నిరసనలు తెలుపుతూ గులాబీ పార్టీలో కాకరేపుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచే వీరి వైరం మొదలైంది.

కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ను జైపాల్ యాదవ్ - కసిరెడ్డి ఇద్దరూ కోరుకోగా.. కేసీఆర్ ను మెప్పించి జైపాల్ యాదవ్ సాధించారు. ఎమ్మెల్యే అయ్యారు. ఇక కసిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ, -వైస్ ఎంపీపీలు కసిరెడ్డి సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరారు. కొద్దికాలంగా పార్టీ పరంగా అన్నీ కసిరెడ్డినే చూసుకోవడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ అని.. ఎలా తనకు తెలియకుండా ఎమ్మెల్సీ చేర్చుకుంటారని తప్పుపట్టారు.

ఇక నియోజకవర్గ టీఆర్ ఎస్ నేతలంతా కసిరెడ్డి వైపే నిలవడంతో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంపీపీ అనిత సీట్లో కూర్చొని సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి తీరుపై ఆమె ఫిర్యాదు కూడా చూసింది. ఎమ్మెల్యే వర్గం దీన్ని రచ్చ చేసింది. ఇలా ఇద్దరు నేతలకు క్షణం పడని పరిస్థితి కల్వకుర్తి నియోజకవర్గంలో నెలకొంది.

ఈ ఇద్దరిపై కెసిఆర్ నిఘా పెడుతున్నారని, ఇప్పటివరకు మౌనంగా చూస్తున్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు నాయకుల తప్పులు, చర్యలను కేసీఆర్ ఇప్పటికే గమనించారంటున్నారు. కఠిన చర్యలు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.