Begin typing your search above and press return to search.
అంతటి కేసీఆర్ రాజీనా? ముందు జాగ్రత్త పడ్డారా?
By: Tupaki Desk | 4 Feb 2023 10:59 AM GMTరాజకీయంలో ఎత్తులకు పై ఎత్తులు వేసే కేసీఆర్ తాను అనుకున్నది సాధించేవరకు పట్టువదలడు. తనకున్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని విజేతగానే నిలిచేందుకే ప్రయత్నిస్తాడు. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ మార్క్ దేశంలో స్పష్టంగా కనిపిస్తుందని కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు సైతం అంటున్నారు. త్వరలో జాతీయ రాజకీయాల్లోనూ ఆయన సక్సెస్ అవుతారని కొనియాడుతున్నారు. అలాంటి కేసీఆర్ సొంత రాష్ట్రం తెలంగాణలో మాత్రం వెనకడుగు వేయాల్సి వచ్చిందని అంటున్నారు. కొన్ని నెలలుగా గవర్నర్ తో ఏర్పడిన వివాదాల్లో కేసీఆర్ దూకుడగా వెళ్లినా.. చివరికి రాజీ పడాల్సి వచ్చిందని చర్చించుకుంటున్నారు. అయితే రాబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడ్డారని మరికొందరు అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ ఒక మెట్టు ఎందుకు దిగాల్సి వచ్చింది?
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతో గత కొన్ని నెలలుగా ఏర్పడిన రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య ఉన్న గ్యాప్ తొలిగిపోయిందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ స్పీచ్ సాఫీగా సాగింది. ఎలాంటి ఆందోళనలు లేకుండా.. ఎవరూ అభ్యంతరం చెప్పకుండా గంట వరకు తమిళ సై ప్రసంగించడాన్ని అందరూ ఆమోదించారు. దీంతో కొన్ని రోజులుగా ఏర్పడిన అయోమయానికి తెరపడింది. వాస్తవానికి గవర్నర్ స్పీచ్ పై రాజకీయంగా.. ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం రాసిన స్క్రిప్టులో కేంద్రంపై ఉండే విమర్శలను చదువుతారా? లేక స్కిప్ చేస్తారా? అని తీవ్రంగా చర్చించుకున్నారు. కానీ గవర్నర్ ఎక్కడా గ్యాప్ లేకుండా ప్రసంగించడంతో ప్రభుత్వం కేంద్రంపై ఎలాంటి విమర్శల వ్యాఖ్యలు ప్రసంగంలో చేర్చలేదని తెలుస్తోంది.
ప్రభుత్వం ముందుజాగ్రత్తగానే కేంద్రంపై విమర్శలు లేకుండా ప్రసంగాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదిగి గవర్నర్ తో ఉన్న విభేదాలతో కేసీఆర్ తమిళ సై ప్రసంగం లేకుండా గత బడ్జెట్ సమావేశాలను నిర్వహించారు. ఈసారి కూడా అలాగే నిర్వహించడానికి రెడీ అయ్యారు. అయితే బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. దీంతో అక్కడ జరిగిన పరిణమాల నేపథ్యంలో ప్రభుత్వమే తన పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. ఆ తరువాత గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రకటించడంతో సమావేశాలకు ఆమోదం తెలిపారు.
అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ కేంద్రంపై పోరు మొదలు పెట్టి ఏడాదవుతోంది. అయితే కేంద్రంపై ఉన్న కోపంతో ఆ పార్టీకి చెందిన గవర్నర్ విషయంలో ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. గవర్నర్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు సరైన సౌకర్యాలు కల్పించలేదు. అయితే ఒక మహిళగా.. గవర్నర్ గా తనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదని గవర్నర్ తో పాటు బీజేపీ నాయకులు కేసీఆర్ పై విమర్శలు చేశారు. అయితే తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివాదం మరింత ముదరడంతో కేంద్రం నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో కేంద్రంతో పోరు పెట్టుకోవడం అంత మంచిది కాదని కొందరు రాజకీయ విశ్లేషకులు కేసీఆర్ కు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్ ద్వారా పలు వ్యాఖ్యలు చేయించడంతో కొందరు బీఆర్ఎస్ నాయకులు నేరుగా గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా ప్రజల్లోకి బీఆర్ఎస్ పై బ్యాడ్ ఇంప్రెషన్ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ వివాదాలు ముదిరి రాష్ట్రంలో అలజడులు మొదలైతే కేంద్రం రంగంలోకి దిగి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది.
ఇక గవర్నర్ ఆమోదిస్తేనే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఆకర్షించే విధంగా బడ్జెట్ లో హామీలు, పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. అందువల్ల బడ్జెట్ సమావేశాలు జరగకపోతే ప్రజలు ప్రభుత్వాన్ని పట్టించుకోరు. ఇప్పటికే గవర్నర్ కు ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదని తమిళ సై పై సింపతి పెరుగుతోంది. వీటన్నింటి ద్వారా ప్రభుత్వంపై అసహనం పెరిగితే వచ్చే ఎన్నికలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఒక మెట్టు దిగక తప్పదని కేసీఆర్ భావించి రాజీకొచ్చారని అనుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.