Begin typing your search above and press return to search.

ఏపీ ఎంపీల పాడు బుద్ధిని బ‌య‌ట‌పెట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   25 Aug 2018 7:30 AM GMT
ఏపీ ఎంపీల పాడు బుద్ధిని బ‌య‌ట‌పెట్టిన కేసీఆర్
X
ముంద‌స్తుకు సిద్ధ‌మ‌వుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. తాజాగా పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో విస్తృత స్థాయి స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు గంట ప‌దిహేను నిమిషాల పాటు సాగిన ఈ స‌మావేశంలో ఆస‌క్తిక‌ర అంశాల్ని ఆయ‌న వెల్ల‌డించారు.

ముంద‌స్తుకు తాను వెళుతున్న వైనాన్ని స్ప‌ష్టం చేసిన కేసీఆర్‌.. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయోన‌న్న అంశంపై క్లారిటీ ఇవ్వ‌కున్నా.. పార్టీ నేత‌ల‌కు మాత్రం బాగానే అర్థ‌మైంది. భారీ బ‌హిరంగ స‌భ జ‌రిగిన వెంట‌నే ఎన్నికలు ముంచుకొస్తాయ‌న్న మాట వారి నోట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. స‌మావేశంలో ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీల‌కు.. టీఆర్ ఎస్ ఎంపీల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసాన్ని ఆయ‌న చెప్పిన వైనం అంద‌రిని ఆక‌ట్టుకునేలా చేసింది. తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర‌మంత్రుల్ని క‌లిసిన‌ప్పుడు వారంతా టీఆర్ ఎస్ ఎంపీల‌ను మెచ్చుకుంటార‌ని చెప్పారు. వారంతా ప్ర‌జా స‌మ‌స్య‌లు.. పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని అడుగుతుంటార‌ని.. కానీ ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీలు మాత్రం అందుకు భిన్నంగా ప్ర‌తిసారీ పైర‌వీల‌తో త‌మ వ‌ద్ద‌కు వ‌స్తార‌ని చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

పార్టీ ఎంపీల ప‌నితీరు బాగుంద‌ని.. కేంద్ర మంత్రులు సైతం వారి ప‌ని తీరుకు కితాబులు ఇస్తున్నార‌ని.. ఏపీ ఎంపీల మాదిరి కాకుండా రాష్ట్రం కోసం టీఆర్ ఎస్ ఎంపీలు ప‌ని చేస్తున్న వైనాన్ని చెప్పి.. వారికి ప్ర‌త్యేక అభినంద‌న‌లు చెప్పారు. పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశంలో ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీల తీరును కేసీఆర్ ప్ర‌స్తావించ‌టం.. ఏపీ ఎంపీల క‌క్కుర్తి.. స్వార్థ రాజ‌కీయాలు ఆంధ్రోళ్ల ప్ర‌యోజ‌నాల్నిఎలా దెబ్బ తీస్తున్నాయ‌న్న విష‌యాన్ని కేసీఆర్ త‌న మాట‌ల‌తో చెప్ప‌క‌నే చెప్పేశార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.