Begin typing your search above and press return to search.

కేసీఆర్ డేరింగ్‌!..టికెట్టిచ్చేది లేదంటూ ప్ర‌క‌ట‌న‌!

By:  Tupaki Desk   |   11 March 2019 2:55 PM GMT
కేసీఆర్ డేరింగ్‌!..టికెట్టిచ్చేది లేదంటూ ప్ర‌క‌ట‌న‌!
X
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు డేరింగ్ నిర్ణ‌యాల‌కు పెట్టింది పేరుగా మారుతున్నారు. ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఒకే సారి దాదాపుగా మొత్తం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసిన కేసీఆర్‌... అస‌లు అసమ్మ‌తి అనేది లేకుండా వ్య‌వ‌హారం న‌డిపారు. క‌సీఆర్ డేరింగ్‌ కు అనుగుణంగానే ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ కు బంప‌ర్ మెజారిటీ రావ‌డం - మ‌రోమారు కేసీఆర్ సీఎం కావ‌డం జ‌రిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు కేబినెట్టే లేకుండా రెండు నెల‌ల పాటు పాల‌న సాగించిన కేసీఆర్‌... అస‌లు కేబినెట్ లేకుండా పాల‌న ఎలా సాగిస్తారని అడిగిన నాథులే లేకుండా చూసుకున్నారు. మొత్తంగా కేసీఆర్ త‌త్వాన్ని చూస్తుంటే.. ఇంత‌కుముందు కంటే కూడా ఇప్పుడు ఆయ‌న వ్య‌వ‌హార స‌ర‌ళిలో మ‌రింత డేరింగ్ క‌నిపిస్తోంద‌ని చెప్పాలి. ఇందుకు నిద‌ర్శ‌నంగానే నేటి మ‌ధ్యాహ్నం జ‌రిగిన పార్టీ స‌మావేశంలో కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో ఎంపీ సీట్ల‌కు ఎంపిక చేయాల్సిన అభ్య‌ర్థుల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా... ఈ ద‌ఫా ఒక‌రిద్ద‌రికి సీట్లిచ్చేది లేదంటూ కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పదహారు స్థానాలు మనమే గెలుస్తామని ధీమా వ్య‌క్తం చేసిన కేసీఆర్... సిట్టింగ్‌ లలో ఒకరిద్దరికి టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. వారు పార్టీకి నష్టం చేశారని- అందుకే టిక్కెట్ నిరాకరిస్తున్నామని కూడా కేసీఆర్‌ తెలిపారు. కానీ ఆ ఇద్దరు ఎవరో మాత్రం కేసీఆర్ చెప్పలేదు. పార్టీకి నష్టం చేస్తే ఉపేక్షించేది లేదని కూడా కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగిచ్చేశారు. మొత్తంగా డేరింగ్ అంటే కేసీఆర్‌దేన‌న్న వాద‌న ఇప్పుడు బ‌లంగానే వినిపిస్తోంది.