Begin typing your search above and press return to search.
చక్రం తిప్పే- కాంగ్రెస్ ఎంపీ ఖంగుతిన్నారు!
By: Tupaki Desk | 31 Oct 2015 3:53 AM GMTఆయన పేరు కాంగ్రెస్ ఎంపీ! కానీ అధికారంలో ఎవరు ఉన్నా సరే.. తాను తలచిన విధంగా చక్రం తిప్పగలరు. ఏయే రంగాల్లో పాప్యులారిటీ అనేది పుష్కలంగా ఉంటుందో.. ఆయా అన్ని రంగాల్లోనూ ఆయనకు నిండుగా పాత్ర ఉంటుంది. ఆయన ఎంత చిత్రమైన సెలబ్రిటీ అంటే.. తన పుట్టిన రోజు పండుగ వస్తే.. ఒకరోజు హైదరాబాదు ఆధునికతతోను, మరొకరోజు విశాఖలో ఆధ్యాత్మికతతోను, మరొకరోజు ముంబాయిలో ఆల్కహాలికతతోనూ దానిని మూడుసార్లు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అన్ని ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులతోనూ చాలా కలివిడిగా ఉంటూ ... అందరు మీడియా వారితోనూ కలిసిపోతూ.. తన పనులు చక్కబెట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య! అలాంటి దురంధరుడైన కాంగ్రెస్ ఎంపీ గారికి.. కేసీఆర్ సర్కారు గట్టి షాకే ఇచ్చినట్లుగా అనుకుంటున్నారు.
రాజధాని నగరంలో హైటెక్ సిటీ సమీపంలో ఉన్న బొటానికల్ గార్డెన్ ప్రాంతంలో ఎకో టూరిజం పేరుతో లీజుకు తీసుకుని హోటళ్లు, సినిమా హాళ్లు నిర్మించడానికి మూడు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాలను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసేసింది. ఇలాంటి నిర్మాణాల వలన పర్యావరణానికి చేటు జరుగుతున్నదంటూ అనేకఉద్యమాలు సాగడంతో.. బొటానికల్ గార్డెన్ పరిరక్షణకు కేసీఆర్ నడుంబిగించారు. ఈ ఎకోటూరిజం ముసుగులో దోపిడీకి అనుమతించకుండా,, దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి నిర్ణయించారు.
అయితే దీనిని ఎకో టూరిజం కోసం లీజుకు తీసుకున్న సంస్థల వెనుక ఈ కాంగ్రెస్ ఎంపీగారే ఉన్నారన్నది భోగట్టా. ఈ బొటానికల్ గార్డెన్ పరిరక్షణ కోసం గతంలో ఉద్యమించిన ప్రజాసంఘాలు ఆయనకు వ్యతిరేకంగా కూడా అప్పట్లో పోరాడారు. ఎన్నికల్లో నిలబడినప్పుడు ఓడిపోతూ, పార్టీలో తనకున్న లాబీయింగ్ తో రాజ్యసభ సభ్యుడిగా మాత్రం నిత్యం చెలామణీ అవుతూ.. వ్యాపారాలతో తులతూగుతూ ఉండే ఈ కాంగ్రెస్ ఎంపీ గారికి బొటానికల్ గార్డెన్ విషయంలో కేసీఆర్ సర్కార్ గట్టి షాకే ఇచ్చిందని అంతా అనుకుంటున్నారు.