Begin typing your search above and press return to search.
కేసీఆర్ లెక్క 105 సీట్లు.. సాధ్యమేనా..?
By: Tupaki Desk | 18 May 2023 6:00 AM GMTమరో ఆరు నెలల్లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో విజయం బిఆర్‌ఎస్‌దేనని అంటున్నారు గులాబీ బాస్ కేసిఆర్. సర్వేలన్నీ బిఆర్‌ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగినా తమ పార్టీ 105 సీట్లు గెలుస్తుందని చెబుతున్నారు. బిజెపికి భారీగా సీట్లు పెరగవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో భారీ విజయం సాధించినందు వల్ల అదే పరంపర తెలంగాణలోనూ సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ కేసిఆర్ చెబుతున్న 105 సీట్లు తెలంగాణలో బిఆర్‌ఎస్ వచ్చే అవకాశం ఉందా..?
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పలు రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో తెలంగాణలో జరిగే ఎన్నికల పట్ల ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ పార్టీ అప్రమత్తమైంది. కర్ణాటక ఫలితాలకు ముందే లీడర్లతో సమావేశమైన కేసిఆర్ మరోసారి తాజాగా ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీకి 105 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ సీట్లను ఇలాగే నిలుపుకోవడానికి ఎమ్మెల్యేలు పెద్దగా కష్టపడాల్సిన పని లేదని అన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు బిఆర్‌ఎస్ చేసిన మేలు ఏంటో చెబితే చాలన్నారు. గత పదేండ్లలో తెలంగాణ ప్రజలకు అమలు చేసిన పథకాలు, అభివృద్ధి గురించి వివరించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు.
బిఆర్‌ఎస్ లీడర్లంతా హైదరాబాద్‌లో మాకాం వేయకుండా పూర్తిగా తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. రైతులు పని చేసుకునే స్థలాల్లోకి, పొలాల్లోకి వెళ్లి మాట్లాడాలని, వారితో కలిసి భోజనం చేయాలని, వారి సాధకబాధలను వినాలని అన్నారు. వారికున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. గడిచిన 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని, పదేండ్ల కాలంలోనే రాష్ట్రాన్ని తాము ఎంతగా అభివృద్ధి చేశామో, ఎన్నెన్ని పథకాలు అమలు చేశామో చెప్పాలని అన్నారు.
ఇక తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా థాబ్ద ఉత్సవాలు వైభవంగా జరపాలని కేసిఆర్ మంత్రులకు,ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు జిల్లాల్లో తెలంగాణ థాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలన్నారు. ఇదే వేదికగా రాబోయే ఎన్నికల్లో విజయానికి పునాదులు వేయాలని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ తరపున కూడా గ్రామగ్రామాన థాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని కార్యకర్తలకు, నాయకులకు ఆదేశాలు ఇచ్చారు.