Begin typing your search above and press return to search.

కొత్త బడ్జెట్ కసరత్తులో కేసీఆర్

By:  Tupaki Desk   |   19 Jan 2020 5:01 AM GMT
కొత్త బడ్జెట్ కసరత్తులో కేసీఆర్
X
కొత్త సంవత్సరం వచ్చేయటమే కాదు.. చూస్తుండగానే క్యాలెండర్ లో ఇరవయ్యో రోజు కరిగిపోయే పరిస్థితి. కొత్త ఏడాదిలో కొత్త బడ్జెట్ మీద కసరత్తు తెలంగాణలో మొదలైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాధమిక కసరత్తు పూర్తి అయినట్ులగా తెలుస్తోంది. పద్దు ప్రతిపాదనల్ని ఈసారి వాస్తవ గణాంకాలతో రూపొందించి.. తమకు వెంటనే పంపాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని విభాగాలకు తెలియజేసింది. గత ఏడాది మాదిరి కాకుండా.. ఈసారి అందుకు భిన్నంగా వాస్తవ రూపంలో బడ్జెట్ ఫిగర్స్ ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత.. ఏడాదికేడాది బడ్జెట్ ఫిగర్స్ ను పెంచేసుకుంటూ పోవటం తెలిసిందే. వాస్తవ బడ్జెట్ గణాంకాలకు ప్రతిపాదిత అంకెలకు పోలిక లేని తీరును గత ఏడాది దిద్దుబాటులోకి వెళ్లిన కేసీఆర్ సర్కారు ఈసారీ అదే తీరును ప్రదర్శించాలని భావిస్తోంది.

గత ఏడాది తొలుత ఓటాన్ అకౌంట్ కింద రూ.1.82లక్షల అంచానలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్టిన బడ్జెట్ ను మాత్రం గతానికి భిన్నంగా వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. దీంతో ప్రతిపాదిన రూ.1.82లక్షల కోట్ల స్థానే రూ.1.46 లక్షల కోట్లకు కుదించటం తెలిసిందే.

తాజాగా కసరత్తు చేస్తున్న బడ్జెట్ కు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధుల కేటాయింపుల ఆధారంగా చేపట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. గతానికి భిన్నంగా ఆల్ ఈజ్ వెల్ అనే ఫ్యాక్టర్ ను వదిలేసి..వాస్తవ గణాంకాల్లో బడ్జెట్ ను తయారు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది అంకెల్ని పెంచుకుంటూ వెళ్లటం ద్వారా వాటిని సర్దుబాటు చేయటానికి కిందా మీదా పడాల్సి వస్తోంది.

ఇలాంటివేళ.. మాంద్యం కలిసి వచ్చినట్లుగా చెబుతున్నారు. మాంద్యం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. దాన్ని అడ్డు పెట్టుకొని బడ్జెట్ ను వాస్తవ గణాంకాల్లోకి తీసుకురావటం ద్వారా.. గతంలో చేసిన తప్పుల్ని దిద్దుబాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ఫిబ్రవరి మూడో వారంలో తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.