Begin typing your search above and press return to search.
కేసీఆర్ బర్త్ డే కు అదిరిపోయేలా ఏర్పాట్లు
By: Tupaki Desk | 16 Feb 2023 10:32 PM GMTతెలంగాణ సీఎం పుట్టిన రోజు ఫిబ్రవరి 17. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఊరువాడా హోరెత్తిస్తున్నారు. సంబురంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి విస్తరిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పుట్టినరోజును అధికారులు, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు పండుగలా జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఈరోజు రాత్రి చిత్రపరిశ్రమ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డే వేడుకను అదిరిపోయేలా చేశారు కేసీఆర్. ఎన్నికల ఏడాది కావడంతో పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోయింది. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ వంటి నినాదాలతో ఎటు చూసినా కేసీఆర్ హోర్డింగులు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రోజంతా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
గురువారం సాయంత్రం నెక్లస్ రోడ్ లోని సంజీవయ్య పార్క్ పక్కన రోజంతా భారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంక్షేమ పథకాలపై జబర్ధస్త్ కళాకారులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భారీ కేక్ కటింగ్.. భోజన ఏర్పాట్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ లాంటివి పంపిణీ చేశారు.
ఇక పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారు. కానీ ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. సచివాలయ ప్రారంభోత్సవాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించాలని చూసినా అది వాయిదా పడింది. సీఎం పుట్టిన రోజు అయిన శుక్రవారం పండుగను ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు.
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు కేసీఆర్ బర్త్ డే వేడుకలను శుక్రవారం అదిరిపోయేలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యాయి. దేశవాప్తంగా యాడ్స్, పత్రికలకు ప్రకటనలు, సోషల్ మీడియాలో ట్రెండింగ్.. మీడియాలో శుభాకాంక్షలతో నింపాలని మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. ప్రధాని సహా ఏ రాజకీయ నేత పుట్టిన రోజుకు జరగని విధంగా కేసీఆర్ పుట్టినరోజున ఈ హంగామా చేయడానికి అంతా రెడీ అయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.