Begin typing your search above and press return to search.

కోర్టు తీర్పు రాగానే కేసీఆర్ లైన్లోకి వ‌చ్చేశారు

By:  Tupaki Desk   |   9 Feb 2017 5:12 AM GMT
కోర్టు తీర్పు రాగానే కేసీఆర్ లైన్లోకి వ‌చ్చేశారు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప‌రిపాల‌న నిర్ణ‌యాల‌కు - కోర్టు ఆదేశాల‌కు ఉన్న ద‌గ్గ‌రి సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సీఎం పీఠం అధిరోహించిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు అనేకం కోర్టుల వ‌ద్ద‌కు చేరాయి. వాటిల్లో మెజార్టీ కేసుల్లో ఆయ‌న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా తీర్పులు వ‌చ్చాయి. అయితే తాజాగా వచ్చిన ఓ తీర్పు కేసీఆర్‌ కు పెద్ద ఉప‌శ‌మ‌నం ఇచ్చింది. అందుకే కోర్టు తీర్పు కాపీ కూడా అంద‌క‌ముందే ఆఘ‌మేఘాల మీద‌ కేసీఆర్ రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేశారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఇంత వేగంగా కేసీఆర్ రియాక్ట‌యింది హైదరాబాద్‌ లో ఎస్సీ - ఎస్టీ - బంజారా భవనాల నిర్మాణ పనులకు సంబంధించిన కేసు విష‌యంలో!

ఆదివాసీ - బంజారా భవనాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు స్వయంగా 11 డిసెంబర్ 2014న శంకుస్థాపన చేశారు. ఎస్సీల కోసం బాబు జగ్జీవన్‌ రామ్ భవన్ - ఆదివాసీల కోసం కొమురం భీమ్ భవన్ - బంజారాలకు బంజారాభవన్‌ ను నిర్మించడానికి బంజారాహిల్స్‌లోని సర్వేనెంబర్ 403లో ప్రభుత్వం మూడేళ్ల‌ క్రితం మూడెకరాల భూమిని కేటాయించింది. నిధులను కూడా వెంటనే మంజూరు చేసింది. నిర్మాణాలు ప్రారంభమయ్యేలోపు కొందరు ప్రైవేట్ వ్యక్తులు కోర్టులో పిటిషన్ వేసి ఇది వివాదంలో ఉన్న ఆస్తి అని పేర్కొన్నారు. ప్రభుత్వం భూమి అని పేర్కొంటూ వివిధ భ‌వ‌నాల‌కు కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం కోర్టులో భూమి సర్కార్‌ దని, కేటాయింపులు సక్రమమైనదేనని వాదించింది. అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితోపాటు అధికారులు సాక్ష్యాలు సమర్పించారు. దీనిపై హైకోర్టు విచారించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో ఈ విషయంపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్సీ - బంజారా - ఆదివాసీల భవనాల నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. వెంటనే టెండర్లను పిలవాలని సూచించారు.

ఇదిలాఉండ‌గా... 2015 జ‌న‌వ‌రిలో దొడ్డి కొముర‌య్య భ‌వ‌న్‌ - క్రిస్టియ‌న్ల భ‌వ‌నాల‌కు సికింద్రాబాద్‌ లోని మ‌హేంద్ర‌హిల్స్‌లో కేసీఆర్ శంఖుస్థాపన చేశారు. దొడ్డి కొముర‌య్య భ‌వ‌న్ కు 1.20 ఎక‌రాలు - క్రిస్టియ‌న్ భ‌వ‌న్ కు 2 ఎక‌రాలు కేటాయించారు. అయితే ఈ రెండు భ‌వ‌నాల‌కు కేటాయించిన స్థ‌లం గ‌తంలో ఏపీ గృహ‌నిర్మాణ మండ‌లికి ప్ర‌భుత్వం కేటాయించింది. దీంతో ఆ అంశంపై ప‌లువురు కోర్టుకు వెళ్ల‌డంతో న్యాయ‌స్థానం స్టే విధించింది. త‌ద్వారా ఈ రెండు భవానాల పరిస్థితి అలాగే ఉంది. కేసీఆర్ హామీ ఇచ్చిన‌ మెజార్టీ సామాజిక‌వ‌ర్గాల‌ ఇచ్చిన భ‌వ‌నాల‌న్నీ ఇవే కోవ‌లోకి చేర‌డం గమ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/