Begin typing your search above and press return to search.
భూమిపూజకు పిలిస్తే.. రూ.25 కోట్లు అనౌన్స్ చేసిన వచ్చిన కేసీఆర్
By: Tupaki Desk | 8 May 2023 6:05 PM GMTఅంచనాలకు అందని రీతిలో వ్యవహరిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా అలాంటి పనే చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. ఓపక్క అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరగటంతో అన్నదాతలు లబోదిబో మంటున్నారు. అనూహ్య వర్షాలకు దారుణంగా దెబ్బ తిన్న రైతుల కు ఊరట కలిగించేలా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు ముఖ్యమంత్రి కేసీఆర్.
అందుకు భిన్నంగా.. ఆయన ఈ రోజు (సోమవారం) వెళ్లిన భూమిపూజ కార్యక్రమంలో రూ.25 కోట్ల భారీ మొత్తాన్ని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇంతకూ అదెక్కడ? అంటారా? అక్కడికే వస్తున్నాం. హరే క్రిష్ణా మూవ్ మెంట్ సంస్థ ఆధ్వర్యంలో హరే క్రిష్ణా హెరిటేజ్ టవర్ ను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కోకాపేట ప్రాంతంలోని ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.200కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ దేవాలయంలో 400 అడుగుల ఎత్తులో హెరిటేజ్ టవర్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రారంభంలో భాగంగా చేపట్టిన భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ముఖ్య అతిధిగా వ్యవమరించిన ఆయన మాట్లాడుతూ.. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందన్నారు. మతం.. దేవుడు హింసకు వ్యతిరేకమని.. మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారన్నారు.
మనుషులు.. ప్రాంతాలు.. దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడేనని చెప్పారు. ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాల్ని చేపట్టగలరని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో హరే క్రిష్ణ హెరిటేజ్ టవర్ ను నిర్మించటం మంచి పరిణామంగా అభివర్ణించిన ఆయన.. ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తామని ప్రకటించటమే కాదు.
ఆ మొత్తాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఆలయానికి రూ.25 కోట్ల మొత్తాన్ని ప్రకటించటం తప్పేం కాదు కానీ అకాల వానలతో అల్లాడుతున్న రైతులకు ఊరటనిచ్చే ప్రకటన చేస్తే మరింత బాగుండేది కదా? అలాంటి పని ఎందుకు చేయరు కేసీఆర్?