Begin typing your search above and press return to search.
గోటితో పోయేది గొడ్డలిదాకా అంటే ఇదే కేసీఆర్
By: Tupaki Desk | 8 Nov 2019 9:15 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైంది? ఎంత చిక్కుముడినైనా తన మేథతో సులువుగా విప్పేసే సత్తా ఉన్న అధినేతగా పేరున్న ఆయన.. ఎందుకిలా చేస్తున్నారు? ఏ విషయంలోనూ తెగే వరకూ లాగకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నారు. ఒక అడుగు వెనక్కి.. ఒక మాటతో పూర్తి అయ్యే ఇష్యూను ఇన్నేసి రోజులు ఎందుకు సా..గదీస్తున్నారు? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై ఐదు వారాలకు దగ్గరకు వస్తోంది. 48వేల మంది ఉద్యోగులు ఇన్నేసి రోజులుగా చేస్తున్న సమ్మె ఆర్టీసీకే కాదు.. తెలంగాణ ప్రభుత్వానికి సైతం తలనొప్పిగా మారింది. తన మీద ఘీంకరించిన వారిని డీల్ చేసే విషయంలో కేసీఆర్ గతంలో వ్యవహరించిన తీరుకు.. తాజాగా అనుసరిస్తున్న విధానానికి ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు.
ఏదైనా అంశంపై ఎవరైనా ముకంపట్టు పడితే..మొదట ఆగ్రహం వ్యక్తం చేసినా.. దాని కారణంగా తనకు చికాకు తప్పదన్న విషయాన్ని గుర్తించిన పక్షంలో వెంటనే తనను తాను సరిదిద్దుకోవటమే కాదు.. ఒక అడుగు వెనక్కి వేసేందుకు మొహమాట పడేవారు కాదు. అంతేకాదు.. అప్పటివరకూ తనను డౌన్.. డౌన్ అని నినదించే వారి చేత జైజైలు కొట్టించుకున్న ట్రాక్ రికార్డు కేసీఆర్ సొంతం.
కానీ.. ఆర్టీసీ ఎపిసోడ్ ను ఆయన పర్సనల్ గా తీసుకోవటమే పెద్ద సమస్యగా చెబుతున్నారు. ఈ విషయంలో లెక్కలు తేలాల్సిందే అన్న పట్టుదలే కేసీఆర్ కొంప ముంచుతుందంటున్నారు. దీనికి తోడు.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం కూడా కేసీఆర్ మైండ్ సెట్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందంటున్నారు. కానీ.. ఆయన మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. ఉప ఎన్నిక ఫలితానికి.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏ మాత్రం లింకు లేదన్నది.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ప్రజాతీర్పును ప్రతిబింబిస్తుందని చెప్పలేం. ఎందుకంటే.. ఆ ఫలితం అలా రావటానికి తానెన్ని వ్యూహాల్ని అమలు చేశానన్న విషయం కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. అలాంటప్పుడు.. ఉప ఎన్నిక ఫలితం తన ప్లానింగ్ తప్పించి.. ప్రజాతీర్పు ఏ మాత్రం కాదన్నది మర్చిపోకూడదు. ఆర్టీసీ సమ్మె విషయంలో తన మాటను మొదట్నించి పట్టించుకోవటం లేదన్న కోపం కేసీఆర్ లో అంతకంతకూ పెరుగుతోంది. అదే.. ఆయన చేత తప్పుల మీద తప్పులు చేస్తుందని అంటున్నారు.
లేకుంటే.. గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చుకున్న కేసీఆర్.. ఇకనైనా తప్పుల పరంపరను ఆపేస్తే మంచిందంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో విలీన విషయాన్ని కమిటీ వేసి తేలుస్తామని.. మిగిలిన డిమాండ్ల చిట్టాలో ఖర్చుకు సంబంధం లేని అంశాల్ని ఓకే చేస్తే.. ఎవరి పని వారిదన్నట్లుగా పరిస్థితి ఉండేదని.. అందుకు భిన్నంగా మొండిగా వ్యవహరించటం ద్వారా కేసీఆర్ కొత్త తిప్పలు తెచ్చి పెట్టుకున్నారని అధికార పార్టీ నేతలే అనధికార సంబాషణల్లో ఒప్పుకోవటం గమనార్హం.