Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ పై కేసీఆర్ అలా.. జగన్ ఇలా..!
By: Tupaki Desk | 19 April 2020 9:54 AM GMTఒకటేమో సంపన్న రాష్ట్రం.. బాండ్లు వెదజల్లి అయినా డబ్బులు జమచేసుకోవచ్చు. ఇంకొకటేమో రాజధాని కూడా లేని అప్పుల్లో ఉన్నా రాష్ట్రం.. ఏ రకంగానూ ఆదాయం లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల సీఎంలు కరోనా-లాక్ డౌన్ పై వేర్వేరుగా ముందుకెళ్లేందుకు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
కేంద్రంలోని మోడీ సర్కార్ ఈనెల 20 అంటే రేపటి నుంచి వివిధ రంగాలకు సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే జిల్లాల వారీగా రెడ్ జోన్లు - హాట్ స్పాట్లను ప్రకటించి సడలింపులిచ్చింది. మిగతా ప్రాంతాల్లో రవాణా సహా ఉద్యోగ - వ్యాపారాలు చేసుకునే వెసులుబాటునిచ్చింది. ఆర్థిక రంగం కుప్పకూలుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.
అయితే ఏపీ సీఎం జగన్ కేంద్రం ప్రకటించిన హాట్ స్పాట్ లను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నట్టు తాజాగా సమాచారం. అప్పుల్లో రూపాయి పుట్టని వ్యవసాయ ఆధారిత ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను జోన్లనుగా ప్రకటించి అక్కడ మాత్రమే లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలిసింది. మిగతా ప్రాంతాల్లో ఫ్రీగా వదిలిపెట్టాలని అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై ఈరోజు సాయంత్రంలోగా అధికారిక ప్రకటన వెలువరించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
అయితే సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా తీవ్రతకు భయపడుతూ కేంద్రం సూచించిన ఈనెల 20 నుంచి లాక్ డౌన్ మినహాయింపులను రద్దు చేయడానికే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మే 3 వరకు తెలంగాణలోనే అన్నీ బంద్ ఉండేలా.. లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని ఈ రోజు కేబినెట్ మీటింగ్ అనంతరం ప్రకటించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.. ఈ మేరకు ఈరోజు కేబినెట్ మీటింగ్.. అంతకు ముందు సడలింపులపై రివ్యూ మీటింగ్ లో కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మే 3వరకు కఠినంగా తెలంగాణలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు ఈ సాయంత్రం కేసీఆర్ అధికారికంగా వెల్లడించనున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ లాక్ డౌన్ మినహాయింపులపై వేర్వేరుగా స్పందించబోతున్నారని తెలుస్తోంది. ఏపీలో మినహాయింపులు అమలు కాబోతుండగా.. మే 3 వరకు తెలంగాణలో అంతే స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలు కాబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు దీనిపై స్పష్టత రానుంది.