Begin typing your search above and press return to search.
బాబు ట్యాబ్ లు.. కేసీఆర్ పెన్ డ్రైవ్
By: Tupaki Desk | 1 April 2016 3:58 AM GMTఅవసరానికి తగ్గట్లు ఖర్చుచేయటం చాలా ముఖ్యం. అందులోకి జేబులో పెద్దగా డబ్బులు లేనప్పుడు ఆచితూచి ఖర్చుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరం ఉన్నా..ఆచితూచి ఖర్చుచేసే పద్ధతి ఒకటైతే.. అవసరం అనిపిస్తే చాలు.. వెనుకాముందు చూసుకోకుండా ఖర్చు చేసేయటం మరో పద్ధతి. ఒక విషయానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరును చూస్తే.. వారి మధ్య వ్యత్యాసం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.
సంపన్నరాష్ట్రమైన తెలంగాణలో.. ప్రభుత్వం అనుకోవాలే కానీ.. తమ సభ్యులకు ట్యాబ్ లు ఇవ్వటం పెద్ద విషయమేమీ కాదు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా.. ప్రభుత్వం చెప్పే మొత్తం సమాచారాన్ని పెన్ డ్రైవ్ లోకి నిక్షిప్తం చేసి.. సభ్యులందరికి అందించారు. అలాంటి పెన్ డ్రైవ్ ఒకటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా పంపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటం మర్చిపోకూడదు.
ఈ సందర్భంగా ఇక్కడే మరో విషయాన్ని గర్తించాలి. ఏపీ బడ్జెట్ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్ కాపీల్ని ట్యాబ్ లలో పెట్టి సభ్యులకు అందించారు. ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొనే నేపథ్యంలో.. పేపర్ ఖర్చును తగ్గించటానికి ట్యాబ్ లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు.. కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రుల్ని చూస్తే.. ఒక విషయానికి సంబంధించి సభ్యులకు సమాచారాన్ని అందించటానికి అనుసరించిన విధానం చూస్తే.. వారి మధ్యనున్న తేడా ఇట్టే అర్థమవుతుంది. ఏ అవసరానికి ఎంత ఖర్చు చేయాలన్న లెక్కలో కేసీఆర్ పక్కాగా ఉన్నట్లు కనిపిస్తే.. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తారనటంలో సందేహం లేదు. అందుకు ట్యాబ్.. పెన్ డ్రైవ్ వ్యవహారాలే నిదర్శనం.