Begin typing your search above and press return to search.
పారిశ్రామివేత్తల ఇంట పెళ్లికి ప్రముఖుల తాకిడి
By: Tupaki Desk | 17 Nov 2016 8:38 AM GMTపారిశ్రామికవేత్తల ఇంట వివాహాలు ప్రముఖులతో కళకళలాడుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త నోయల్ ఫార్మా ఇండియా లిమిటెడ్ ఎండీ సండ్రపల్లి వెంకటయ్య కుమారుడు వెంకట బిపిన్ కుమార్ పెళ్లికి రాజకీయ నేతలు - ప్రముఖులు హాజరయ్యారు. మీర్ పేట్ లోని నోమా కళ్యాణ మండపలో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి హాజరై వధూవరవులను ఆశీర్వదించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్ - నాయిని నర్సింహారెడ్డి - గద్దర్ - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు - పలువురు వైసీపీ నేతలు దీనికి అటెండయ్యారు.రాజకీయ నేతలు - మంత్రులు - ప్రముఖుల రాకతో వివాహ మండపం వద్ద హడావుడి నెలకొంది.
హైటెక్సులో జరిగిన మరో పెళ్లి కూడా ప్రముఖుల తాకిడితో కళకళలాడింది. నమస్తే తెలంగాణ చైర్మన్ - మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్ రావు కుమారుడు రాఘవ్ వివాహం మాదాపూర్‌లోని హైటెక్స్ లో జరగ్గా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు - మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు - తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతులు - సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వివాహవేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి - అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కే జానారెడ్డి - టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు - రాష్ట్ర మంత్రులు కే తారక రామారావు - టీ హరీశ్ రావు - ఎంపీ టీ కవిత - టీ న్యూస్ ఎండీ సంతోష్ - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ - మై హోమ్ సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు - బీజేపీ నేత కిషన్ రెడ్డి - సినీనటులు నాగార్జున - నందమూరి బాలకృష్ణ - పలువురు మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - సినీ - రాజకీయ - మీడియా ప్రముఖులు హాజరయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/