Begin typing your search above and press return to search.
కేసీయార్...బాబు మాటా మాటా కలిశాయి...!
By: Tupaki Desk | 30 Jun 2023 9:00 AM GMTచంద్రబాబు మాటల ను కేసీయార్ కోట్ చేస్తారు కేసీయార్ మాటల ను పట్టుకుని తిరిగి చంద్రబాబు వాడుకుంటారు. ఇలా మాటల తో ఇద్దరు చంద్రులు కలిసారు. ఇంతకీలోతట్టు మ్యాటర్ ఏంటి అన్నదే చర్చగా ఉంది. ఇటీవల కేసీయార్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఏపీ లో భూముల రేట్లు దారుణంగా పడిపోయాయి అన్నారు. అభివృద్ధి అక్కడ లేదు అన్నారు. తెలంగాణా లో ఒక ఎకరం అమ్మితే ఏపీ లో చాలా ఎకరాలు కొనొచ్చు అన్నారు. ఆ మాట నిజానికి చంద్రబాబు అన్నారు.
అలా బాబు డైలాగ్ నే కోట్ చేస్తూ కేసీయార్ తన సభలో చెప్పుకుని అటు జగన్ని ఇండైరెక్ట్ గా కార్నర్ చేశారు. ఇక చంద్రబాబు ఇపుడు కేసీయార్ అన్న మాటల ను ఏపీ లో మళ్లీ వల్లించారు. ఏపీ లో భూముల ధరలు పడిపోవడానికి జగన్ విధానాలే కారణం అన్నారు. జగన్ వల్ల ఏపీలో భూముల ధరలు పాతాళానికి జారాయని, అభివృద్ధి లేకపోవడమే దీనికి కారణం అన్నారు. ఇదే విషయాన్ని కేసీయార్ కూడా చెప్పారని అన్నారు.
తాను ఆనాడు హై టెక్ సిటీ కట్టడం వల్ల ఎకరం ముప్పయి వేలు ఉన్న భూముల ధర ముపై కోట్లకు చేరుకుందని గుర్తు చేశారు. ఏపీ లో అమరావతి రాజధాని పూర్తి అయితే అలాగే అయ్యేదని, ఇక కియా మోటార్స్ వల్ల అనంతపురంలో భూముల ధరలు బాగా పెరిగాని అన్నారు.
మరి ఇపుడు అన్నీ కూడా జగన్ హయాం లో లేకుండా పోయాయని టీడీపీ అభివృద్ధిని వైసీపీ కొనసాగించకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని అన్నారు. ఏపీ ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసిన జగన్ గద్దె దిగితేనే ఏపీ కి మేలు అని చంద్రబాబు అన్నారు. జగన్ ఓడాలి ఏపీ గెలవాలి అని ఆయన కొత్త నినాదం ఇచ్చారు.
మరో వైపు చూస్తే నాలుగేళ్ళ పాటు ఏపీ ని ఏమీ కాకుండా చేసి నరకం చూపించిన జగన్ ని ఆయన పార్టీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అంటున్నారు. ఈ విషయాలు ఇలా ఉంటే తెలంగాణా చంద్రుడు అన్న మాటలు ఏపీ చంద్రుడికి నచ్చుతున్నాయి. అలాగే ఏపీ చంద్రుడి మాటాల ను అక్కడి చంద్రుడు హైలెట్ చేస్తున్నారు.
అసలు ఇంతకీ ఈ ఇద్దరు చంద్రుల మధ్య ఉన్న మ్యాటరేంటి. ఏమైనా సంకేతాలా అన్న చర్చ వస్తోంది. తెలంగాణా లో ఎన్నికల తరువాత ఏపీ మీద ఫోకస్ పెట్టేందుకు బీయారెస్ రెడీ అవుతోంది. ఇక తనకు జగన్ పవన్ లోకేష్ ముగ్గురూ మిత్రులే అని కేటీయార్ ఇటీవల వ్యాఖ్యానించారు.
ఏపీలో పొత్తుల విషయం లో బీయారెస్ ని కూడా ఏమైనా కలుపుకుని పోయే ఆలోచన ఉందా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. బీజేపీ ని దూరం పెడితే టోటల్ గా ఏపీ లో అన్ని పార్టీలు టీడీపీ వైపు వస్తాయి. ఆటోమేటిగ్గా బీయారెస్ ని కూడా చేర్చుకునేందుకు వీలు ఉంటుంది.
బహుశా ఈ రకమైన ప్లాన్స్ ఏమైనా బాబు కు ఉండి ఉంటాయని అంటున్నారు. అందుకే కేసీయార్ పేరు ఎత్తి మరీ మాట్లాడారు అంటున్నారు. ఇక కేసీయార్ ని కూడా తన వైపుకు తిప్పుకుంటే జగన్ని సులువుగా ఓడించవచ్చు అన్నదేదో బాబు ప్లాన్ గా ఉందా అన్నది చూడాల్సి ఉంది.