Begin typing your search above and press return to search.
బాలయ్య బొకే వర్క్ వుట్ అయ్యింది
By: Tupaki Desk | 4 March 2016 6:23 AM GMTఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఏపీ ఎమ్మెల్యే కమ్ సీఎం చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడు కమ్ సినీ నటుడు బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలవటం తెలిసిందే. చేతికి బొకే ఇచ్చి.. కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్లటం తెలిసిందే. ఈ సందర్భంలోనే రోగుల విషయంలో తామెంతో శ్రద్ధ తీసుకుంటున్నామని.. వైద్య సేవల్ని మరింత పెంచాలని భావిస్తున్నట్లు అప్పట్లో కేసీఆర్ కు బాలయ్య వివరించారు కూడా.
అయితే.. కేసీఆర్ తో బాలయ్య భేటీ వెనుక అసలు సంగతేమిటన్న విషయాన్ని క్రాస్ చెక్ చేస్తే.. తాను నిర్వహిస్తున్న బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన భవనాల క్రమబద్ధీకరణలో భాగంగా భారీ మొత్తాన్ని చెల్లించాల్సి రావటం.. దాన్ని రద్దు చేయటం ద్వారా తాము చేస్తున్న సేవా కార్యక్రమానికి తెలంగాణ సర్కారు చేయూత ఇవ్వాలని కోరారు.
బాలయ్య వినతిని కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. సానుకూలంగా స్పందించటం మామూలే అయినా.. మాటలు చెప్పినట్లుగా పనులు పూర్తి కావటం కీలకం. అయితే.. తెలంగాణ సర్కారులో సీఎం కేసీఆర్ నోటి వెంట మాట వస్తే.. ఎంత పక్కాగా జరుగుతుందో బాలయ్య ఉదంతంలో రుజువైంది.
బాలయ్య కోరినట్లే బసవతారకం ఆసుపత్రి భవనాల క్రమబద్ధీకరణ కింద చెల్లించాల్సిన రూ.5.72 కోట్లను పరిహరిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్లే తాజాగా జీవో కూడా జారీ అయ్యింది. ఏమైనా కేసీఆర్ మాటంటే మాటేనని తేలింది. తాను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్ కొడుకే స్వయంగా వచ్చి.. తాము చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమానికి ప్రభుత్వం చేయూత ఇవ్వమంటే కేసీఆర్ కాదనలేరు కదా.