Begin typing your search above and press return to search.
మళ్లీ బాబు మైండ్ బ్లాంక్ చేస్తున్నావేం కేసీఆర్
By: Tupaki Desk | 7 May 2018 4:18 PM GMTఇటీవలి కాలంలో ప్రత్యేక హోదా - బీజేపీతో బంధం తెగిపోవడం వంటి అంశాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరో అనూహ్య షాక్ తగిలింది. ఇంకా చెప్పాలంటే...ఇప్పుడిప్పుడే ఏపీలో ప్రతిపక్షాలను దెబ్బకొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిమ్మతిరిగో షాక్ ఇచ్చారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో కోలుకోలేని తప్పిదంగా పార్టీ నేతలు చర్చించుకునే ఓటుకు నోటు కేసును మళ్లీ తెరమీదకు తెచ్చారు.
యువ ఎమ్మెల్యే - ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెరాస ఎమ్మెల్సీకి పెద్దమొత్తంలో సొమ్ము ఇచ్చి తెలుగుదేశం అభ్యర్థికి అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయాలంటూ కోరిన సంఘటనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుపై కూడా ఆరోపణలు ఉన్నాయి. గత కొద్దికాలంగా ఈ కేసు స్తబ్ధుగా మారిపోయింది. అయితే తాజాగా దీన్ని మల్లీ తెలంగాణ సీఎం కేసీఆర్ తెరమీదకు తెచ్చారు. ఈ కేసు విషయంలో ముందగుడు పడుతోంది అనే సిగ్నల్స్ ఇచ్చేందుకు అన్నట్లుగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి - ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు - ఇతర అధికారులలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు.డీజీపీ - సీఎం కేసీఆర్ సమావేశానికి మాజీ ఐఏఎస్ అధికారి ఏకే ఖాన్ ను కూడా ముఖ్యమంత్రి కార్యాలయం పిలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటుకు కోట్లు కేసులో ఏం చేయాలన్న దానిపై న్యాయనిపుణులతోనూ ఆయన చర్చిస్తున్నారని సమాచారం. దీంతో...బాబు బుక్ అవడం ఖాయమా అని రాజకీయవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో హక్కుగా పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉండే అవకాశం దక్కినప్పటికీ నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు పరిపాలన తరలించడం వెనుక ఓటుకునోటు కేసే కారణమనే చర్చ ఉంది. ``హైదరాబాద్ ను వదిలేసి ఒక్క నిమిషం కూడా ముందు వెళ్లం. 10 ఏళ్లు ఇక్కడే ఉండి పాలిస్తాం’’ అని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి అమరావతికి షిప్ట్ అయ్యారు. ఆయనతో పాటు అధికారులను రావాలని హుకుం జారీ చేశాడు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని, తాము రాలేమని చెప్పినా బాబు వినలేదని ఇంత పట్టువెనుక ఓటుకునోటు భయమే కారణమని టాక్ ఉంది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయినందుకే ఇలా చేశారని ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టారు. ఓటుకు నోటు కేసు అనంతరం జరిగిన పరిణామాలను చూస్తే మేధావి అని చెప్పుకొనే చంద్రబాబు తన తొందరపాటుతో ఎదుటివారిని దెబ్బ తీసే ఎత్తుగడలో తానే బుక్ అయిపోయారని అంటున్నారు. తాజా చర్చలతో కేసీఆర్ ఏం తేల్చనున్నారనే చర్చ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.