Begin typing your search above and press return to search.
కేసీఆర్ చెప్పిన మాట ఈసారైనా అమలవుతుందా?
By: Tupaki Desk | 15 July 2016 12:30 AM GMTకొన్ని నెలల క్రితం గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ అధికారపక్షం ఓ రేంజ్ లో ప్రచారం చేయటం తెలిసిందే. టీఆర్ఎస్ ను గెలిపించే బాధ్యతను చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు.. కమ్ మంత్రి కేటీఆర్ తాను అనుకున్నట్లే అన్ని వర్గాల్ని ఆకర్షించే విషయంలో సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న రీతిలో ప్రచారం చేశారు.
అదే పనిగా కాలనీల చుట్టూ తిరగకుండా మూడండే మూడు మీటింగ్ లు పెట్టి.. తాను చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పటమే కాదు.. ఎంత తిరిగి.. ఎన్ని మాటలు చెప్పటం ముఖ్యం కాదు.. చెప్పిన నాలుగు మాటలైనా.. మనసుల్లో ముద్ర పడేలా చెప్పాలన్నట్లుగా వ్యవహరించి అత్యద్భుతమైన విజయాన్ని సాధించటం తెలిసిందే. ఇదే ఎపిసోడ్ లో కేసీఆర్ పాల్గొన్న మూడు సమావేశాల్లో ఒకటి జర్నలిస్టులతో ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ సమస్యల్ని రెండంటే రెండే నెలల్లో తీర్చేస్తానని.. ఇచ్చిన హామీల్ని పూర్తి చేస్తామని చెప్పటమే కాదు.. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్న నేపథ్యంలో.. జర్నలిస్ట్ సోదరులకు కాస్తంత విశాలంగా ఉండేలా ట్రిపుల్ బెడ్రూం లు ఇస్తామని చెప్పి.. జర్నలిస్టుల్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. మాటలు ఎంత తియ్యగా ఉంటాయో.. చేతలు అందుకు భిన్నంగా ఉంటాయన్న విషయం అర్థమయ్యే పరిస్థితి.
జనవరి పోయి ఆర్నెల్లు అయిన పరిస్థితి. మరోరెండు వారాలు గడిస్తే ఏడో నెలలో అడుగు పెట్టే పరిస్థితి. ఇప్పటికి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు కాని పరిస్థితి. ట్రిఫుల్ బెడ్రూం సంగతి తర్వాత.. కనీసం జర్నలిస్టులకు ఇచ్చే హెల్త్ అక్రిడేషన్ కార్డుల జారీ అయినా ఫాస్ట్ గా జరుగుతుందంటే.. అదో పెద్ద ప్రహసనంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓపిక నశించిన జర్నలిస్టులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. హెల్త్ అక్రిడేషన్ కార్డుల జారీలో జరుగుతున్న ఆలస్యాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో.. స్పందించిన కేసీఆర్.. ఆక్రిడేషన్ కార్డుల జారీలో అస్సలు అలస్యం చేయొద్దని.. జర్నలిస్టులకు వెంటనే కార్డులు ఇష్యూ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కనీసం.. ఈసారైనా కేసీఆర్ మాట చెప్పినట్లే అమలవుతుందో? లేదో? చూడాలి.