Begin typing your search above and press return to search.
హైదరాబాద్ కోసమే రూ.77వేల కోట్లు కావాలంట
By: Tupaki Desk | 16 Feb 2016 4:24 AM GMTగ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా చేయాలన్న ఆలోచనను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ పదే పదే ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వారు భారీగానే హామీలు ఇచ్చారు. నగరాన్ని ఎలా మారుస్తామో తెలుసా అంటూ చాలానే విషయాల్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వారికో ప్రశ్న ఎదురైంది కూడా. ఇన్ని చెబుతున్నారు.. ఇలాంటివి చేయటానికి అవసరమైన భారీ నిధుల మాటేమిటి? అని. దీనికి బదులిచ్చిన కేసీఆర్.. బ్రిక్ నుంచి తాము రుణం తీసుకోవాలని భావిస్తున్నట్లు. దీనికి సంబంధించి ఇప్పటికే మాట్లాడినట్లుగా కేసీఆర్ వెల్లడించారు.
గ్రేటర్ ఎన్నికలు ముగిసాయి. బంపర్ మెజార్టీ సాధించిన టీఆర్ ఎస్.. తాము చెప్పినట్లే గ్రేటర్ హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు.. సౌకర్యాలకు సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించింది. దీని కోసం అయ్యే ఖర్చును లెక్క కట్టింది. టీఆర్ ఎస్ సర్కారు వేసిన లెక్క ప్రకారం మొత్తం ఖర్చు అంచనా రూ.77,553గా లెక్క వేసింది. ఈ భారీ మొత్తాన్ని రుణంగా తీసుకోవాలన్న ఆలోచనను వ్యక్తం చేసింది.
ఇంత పెద్ద మొత్తంతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయటం ద్వారా భవిష్యత్తు ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఈ ప్రాజెక్టు రిపోర్ట్ లో విశ్లేషించింది. కేంద్రం నిర్దేశించిన నమూనాకు తగినట్లుగా పంపిన ఈ అంచనాలపై మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మోడీ సర్కారు ఓకే అన్నాకే బ్రిక్స్ బ్యాంకుకు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం కానీ ఓకే అంటే.. జీహెచ్ ఎంసీ పూచీకత్తుగా ఈ భారీ మొత్తాన్ని రుణంగా తీసుకుంటారు.
మరి.. ఈ రూ.77వేల కోట్ల మొత్తంతో ఏం చేస్తారంటే..? (తయారు చేసిన నివేదిక ప్రకారం)
= రోడ్ల కోసం రూ.25,784 కోట్లు
= తాగునీరు.. పారిశుద్ధ్యం కోసం రూ.10,851 కోట్లు
= వర్షపు నీరు రోడ్ల మీద ఉండకుండా ఉండేందుకు రూ.6,900 కోట్లు
= మూసీ పొడవునా ఈస్ట్ వెస్ట్ స్కైవేల కోసం రూ.6,300 కోట్లు
= మూసీ సుందరీకరణ.. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రూ.141 కోట్లు
= ఔటర్ రింగ్ రోడ్ నుంచి అనుసంధానం చేసే రోడ్లకు రూ.6,593 కోట్లు
= గ్రోత్ సెంటర్లలో మౌలిక వసతుల కోసం రూ.13,998 కోట్లు
= గ్రేటర్ తో పాటు మిగిలిన మున్సిపల్ పట్టణాల అభివృద్ధి కోసం రూ.4,000 కోట్లు
= పట్టణాల్లో మిషన్ భగీరథకు రూ.1,652 కోట్లు
= ఇంటింటికి నల్లా కోసం రూ.262 కోట్లు
= 11 పట్టణాల్ని అమృత్ పట్టణాలుగా తీర్చిదిద్దటానికి రూ.1700 కోట్లు
= పట్టణాల అభివృద్ధి కోసం రూ.364 కోట్లు